Monday, December 23, 2024
Home Blog Page 5

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలి: కళ్యాణ్ కార్ జాంగిర్ జి 

0

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలి: కళ్యాణ్ కార్ జాంగిర్ జి.

రంగారెడ్డి జిల్లా గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఎస్పీ-బిఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, వచ్చే లోక్ సభ ఎన్నికలలో బిఆర్ఎస్-బిఎస్పీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించుకోవాలని బిఆర్ఎస్ నాయకులు, ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి పేర్కొన్నారు. గురువారం నాడు పత్రికా విలేకరుల సమావేశంలో కళ్యాణ్ కార్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందని, ఎన్నో ఇండస్ట్రీలు తెలంగాణకు వచ్చాయని, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజల దయనీయ జీవితాలను చూసి చలించిపోయి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, ఐపీఎస్ కి రాజీనామా చేసి, అందరికీ సమన్యాయం జరగాలని, రాజకీయాల్లోకి వచ్చినారని కొనియాడారు. మళ్లీ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు రావాలంటే బిఎస్పి-బిఆర్ఎస్ పార్టీల నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజానీకాన్ని కోరారు. మాజీ సీఎం కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ల నాయకత్వంలో రాబోవు రోజుల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అవ్వాలని ఆకాంక్షించారు.

దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న వారికి చట్టబద్ధత కల్పించాలి:ఇస్లావత్ దశరథ్ నాయక్.

0

దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న వారికి చట్టబద్ధత కల్పించాలి:ఇస్లావత్ దశరథ్ నాయక్

గ్రేట్ తెలంగాణ:మార్చి 07, (శేర్లింగంపల్లి ఇన్చార్జి)

శేరిలింగంపల్లి: మియాపూర్ సర్వేనెంబర్ 28లో సిఆర్పిఎఫ్. క్యాంపు సిబ్బంది జరుగుతున్న అదనపు నిర్మాణం వెంటనే నిలిపివేయాలని దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న వారికి మౌలిక సౌకర్యాలు కల్పించి చట్టబద్ధత కల్పించాలని శేరిలింగంపల్లి ఎమ్మార్వో కు ఎం.సి.పి.ఐ.యు. మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఎం.సి.పి.ఐ.యు. మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ , దశాబ్దాలుగా మియాపూర్ సర్వేనెంబర్ 28లో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న గిరిజన బడుగు బలహీన వర్గాల ఇండ్ల ను పునర్నిర్మాణానికి అలాగే ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ప్రభుత్వాలను విన్నవించుకున్న ప్రజల వినతులను పరిష్కరించలేని పరిస్థితులలో ఉందని, కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం 28 సర్వేనెంబర్ లో భూమిని సిఆర్పిఎఫ్. కు కేటాయించిందంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా నడిగడ్డ తాండ వద్ద చెక్పోస్ట్ వేసుకొని తిష్ట వేసి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నారని ప్రజల ఇండ్ల కూలిపోతున్నప్పుడు మరుగుదొడ్లు కట్టుకుంటే కూడా ఎలాంటి నిర్మాణం వస్తువులను సిఆర్పిఎఫ్. వాళ్ళు అనుమతించకపోగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కానీ వారి సిఆర్.పి.ఎఫ్. క్యాంపు విస్తరణను గత రెండు రోజులుగా ముగ్గు వేసి పునాదులు తవ్వుకుంటూ భారీ నిర్మాణానికి పూనుకుంటున్నారని ఇలాంటి పరిస్థితిని ఇటు రెవెన్యూ అధికారులు చూస్తూ ప్రజలు న్యాయం చేయాలని అర్జిస్తుంటే న్యాయం చేయకపోగా ప్రజలకు ఒక న్యాయంగా చెబుతూ ఎలాంటి స్థలం కేటాయించారన్న విషయాన్ని బహిర్గతం చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ సి.ఆర్.పి.ఎఫ్. వారికి సహకరించడం ఎంతవరకు సబాబు అని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సి ఆర్ పి ఎఫ్. నిర్మాణాలను ఆపివేయాలని దశాబ్దాలుగా నివాసాలు ఏర్పరచుకున్న గిరిజన దళిత బడుగు బలహీన వర్గాల నివాసాలను పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పల్లె మురళి కార్యవర్గ సభ్యులు దేవనూరి నరసింహ పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కే.కనకలక్ష్మి.

0

ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కే.కనకలక్ష్మి

గ్రేట్ తెలంగాణ:మార్చి 08, (శేర్లింగంపల్లి ఇన్చార్జి)

శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలో పాపిరెడ్డి కాలనీలోని ఆర్కే మెడల్ స్కూల్ లో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలోని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ కే.కనకలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే మెడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రత్నకుమారి కే.కనకలక్ష్మి ను శాలువాతో గౌరవప్రదంగా సత్కరించారు. అనంతరం, కే.కనకలక్ష్మి మాట్లాడుతూ,తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారి చదువుకు పూర్తి సహకారం అందించి వారికి బంగారు భవిష్యత్తును అందించాలని, పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలని, పిల్లల అభివృద్ధిని ప్రతిఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ ,ప్రిన్సిపాల్ రత్నకుమారి , ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జెరిపేటి జైపాల్.  

0

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జెరిపేటి జైపాల్.  

గ్రేట్ తెలంగాణ:మార్చి 07, (శేర్లింగంపల్లి ఇన్చార్జి):

ఆకాశంలో సగం మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని నిరంతరం శ్రమించే మహిళా శక్తినీ, యుక్తి, కఠోర దీక్షను, సేవా భావంను ఒక్క మహిళ దినోత్సవం రోజునే కాదు అను నిత్యం వారి సేవలను గుర్తించి వారిని గౌరవించాలని తెలంగాణ టీ.పి.సి.సి జనరల్ సెక్రెటరీ జెరిపెటి జైపాల్ అన్నారు. మహిళలు అన్నిరంగాల్లో మగ వాళ్ళతో పోటీ పడి పని చేస్తూ దేశ పురోగమించే దిశగా వారి పాత్ర ను పోషిస్తున్నారని అన్నారు. గురువారం చందానగర్ డివిజన్ శాంతి నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో సమాజహితం కోసం సేవాభావంతో పనిచేస్తున్న మహిళలను సమావేశ పరిచి ఈ సందర్భంగా వారు శాలువాలతో సత్కరించి సన్మానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్, పోచయ్య లు, సోషల్ మీడియా కన్వీనర్ కవి రాజ్ తలారి తదితరులు పాల్గొన్నారు.

కొండ సురేఖ పై సంచలన వ్యాఖ్యలు చేసిన  బీ యస్ పి పార్టీ నల్గొండ జిల్లా సెక్రటరీ కొండ లలిత.

0

కొండ సురేఖ పై సంచలన వ్యాఖ్యలు చేసిన  బీ యస్ పి పార్టీ నల్గొండ జిల్లా సెక్రటరీ కొండ లలిత

కార్తీకేయ కాన్సెప్ట్ స్కూల్ లో ‘ప్రగ్యాన్ 2024’ సైన్స్ ఫెయిర్ ఎక్సిభిషన్.

0

కార్తీకేయ కాన్సెప్ట్ స్కూల్ లో ‘ప్రగ్యాన్ 2024’ సైన్స్ ఫెయిర్ ఎక్సిభిషన్.

హస్తినాపురం గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

హస్తినాపురం డివిజన్ లోని జడ్పీ రోడ్ లోగల డిఆర్డిఎల్ పార్క్ నందు కార్తీకేయ కాన్సెప్ట్ స్కూల్ నిర్వహించిన ‘ప్రగ్యాన్ 2024’ సైన్స్ ఫెయిర్ ఎక్సిభిషన్ ను నిర్వహించారు .ఈ కార్యక్రమం ముఖ్య అతిధిగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,స్థానిక కార్పొరేటర్ సుజాత నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి వారి ప్రతిభను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మ నాయక్, పాటశాల యాజమాన్యం ప్రిన్సిపల్ గంజి శ్రావణ్ కుమార్,వైస్ ప్రిన్సిపాల్ శీలం లీలా నాగేంద్ర,ఇస్రో సైంటిస్ట్ జి.శ్రీనివాస్ హాజరయ్యారు.

కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమ..

0

కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమ.

పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని పి సి బి అధికారులు.

మనోహరాబాద్, ఫిబ్రవరి 27 గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

మనోహరబాద్ మండలంలోని కళ్ళకల్ పరిశ్రమల నుంచి కాలుష్యం వెదజల్లుతుంటే పిసిబి అధికారులు నిర్లక్ష్యం చూసి చూడనట్లు అలసత్వం వహిస్తున్నారని పలువురు అవేదనవ్యక్తం చేస్తున్నారు, జాతీయ రహదారికి కూతవేటు దూరములో ఉన్న మహాలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ వాయు కాలుష్యం పొగ రూపంలో వదులుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం, పరిశ్రమ నుంచి వదిలిన పొగ కాలుష్యం వల్ల రోడ్డుపై పాదాచారులు వాహనదారులు వెళ్లాలంటే పొగ కాలుష్యం మంచు రూపంలో కమ్ముకుందని తెలిపారు. చుట్టు పక్కల ప్రజలు కాలుష్యం వల్ల కల్లాకల్ గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

పి సి బి ఈ ఈ కుమార్ పాఠక్ వివరణ.

కళ్ళకల్, మహాలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ పై మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఎవరైనా గ్రామస్తులు పొల్యూషన్ వెదజల్లే పరిశ్రమపై ఫిర్యాదు చేస్తే పరిశ్రమపై తగు చర్యలు తీసుకొని. పొగ కాలుష్యం వెదజల్లకుండా నివారించేందుకు నోటీసులు జారీ చేస్తామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ ఈ కుమార్ పాటక్ తెలిపారు.

గ్రేట్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన డిప్యూటీ తహశీల్దార్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు రమేష్..

0

గ్రేట్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన డిప్యూటీ తహశీల్దార్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు రమేష్.

మనోహరబాద్ ఫిబ్రవరి 26, గ్రేట్ తెలంగాణ న్యూస్.

మెదక్ జిల్లా మనోహరబాద్ మండల గ్రేట్ తెలంగాణ ప్రతినిధి సత్యం, డిప్యూటీ తహశీల్దార్ కౌశిక రెడ్డి, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు రమేశ్ చేతులమీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేవారు రిపోర్టర్లు మాత్రమే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మనోహరబాద్ మండల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు రమేశ్,  రిపోర్టర్ శ్రీకాంత్, రిపోర్టర్ నాగేష్ తదితర జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు.

శరీర దారుఢ్యానికి కరాటే శిక్షణ అవసరం: నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ.

0

శరీర దారుఢ్యానికి కరాటే శిక్షణ అవసరం: నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ

కరాటేలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బెల్టుల ప్రదానం.

ఎల్బీనగర్: ఫిబ్రవరి 26: గ్రేట్ తెలంగాణ న్యూస్,

మానసిక ప్రశాంతతకు, శరీర ధారోడ్యానికి కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని నారాయణగూడ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ అన్నారు. యొద్ద గోజురియో స్పోర్ట్స్ కరాటే డు ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ లోని నాగార్జున స్కూల్ లో కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణగూడ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ హాజరై విద్యార్థులకు బెల్టుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ చిన్ననాటి నుండే చదువుతో పాటు స్పోర్ట్స్ రంగంలో ప్రతిభ కనపర్చాలని సూచించారు. కరాటే శిక్షణ పొందిన వారికి స్పోర్ట్స్ కోటలో ప్రభుత్వ ఉద్యోగాలను కూడా సాధించవచ్చనని, తాను స్పోర్ట్స్ కోటలో ఉద్యోగం సాధించానని తెలిపారు. కరాటే శిక్షణ ఆత్మరక్షణతో పాటు మానసిక, శరీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. కరాటేలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ బెల్టులను ప్రదానం చేశారు. అంతకుముందు ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణను నిర్వాహకులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షుడు రాధేశ్యాం తివారి, ప్రధాన కార్యదర్శి రఘుకుమార్, చైర్మన్ రాజేశ్వర్, గ్రాండ్‌ మాస్టర్‌ విఠల్, మాస్టర్లు పి.రాము, బి.రాము, సతీష్, నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ వెంకట్, అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలు: పెద్ది శంకర్ గౌడ్.

0

పేదలకు మెరుగైన వైద్య సేవలు: పెద్ది శంకర్ గౌడ్

రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం.

 

ఎల్బీనగర్: గ్రేట్ తెలంగాణ ప్రతినిధి

 

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ చైర్మన్ పెద్ది శంకర్ గౌడ్ అన్నారు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ చెరువుకట్ట, శంకేశ్వర బజార్ ప్రాంతాలలో గురువారం ఉదయం ముత్తూట్ ఏం జార్జ్ ఫౌండేషన్ సహకారంతో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ది శంకర్ గౌడ్ మాట్లాడుతూ వైద్య పరీక్షలు చేయించుకోలేని నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు తమ సంస్థ ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. ఈ శిబిరంలో కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధులు, లివర్ వ్యాధులు, షుగర్ వ్యాధులు, బీపీ వ్యాధులకు పరీక్షలను ఉచితంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్.రాంరెడ్డి, సీహెచ్.మధు, శివ నేత, సిబ్బంది పాల్గొన్నారు.