టీఆరెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల ఎక్సమ్స్ ఉన్న రోజే ఇక్కడ ఎక్సమ్స్ పెడుతుంది..
కావాలని ఒకే రోజు ఎక్సమ్ పెట్టాలని చూస్తుంది..
ఆగస్ట్ 7 వతేదీన కేంద్ర upsc ఎక్సమ్ తో పాటు..రాష్ట్ర tslprd ఎక్సమ్ ఉంది..
రెండింటి లో ఏదో ఒక జాబ్ వస్తుందని ఆశపడ్డారు..
ఈ రెండు ఎక్సమ్స్ పోలీస్ శాఖకు సంబంధించినదే
దీని వల్ల ఏదో ఒక ఎక్సమ్ నష్టపోయే అవకాశం ఉంది..
దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
కేంద్ర సంస్థ ఎక్సమ్ షెడ్యూల్ ముందే నిర్ణయించారు..
రాష్ట్ర ఎక్సమ్ తరువాత నిర్ణయించారు…
కేటిఆర్ తో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి సైతం ఎక్సమ్ వాయిదా వేయాలని పిర్యాదు చేసారు…
ఎక్సమ్ వాయిదా వేయాలని కాంగ్రెస్ పక్షాన nsui డిమాండ్ చేస్తుంది..
అయిన పట్టించుకోవడం లేదు .
3 రోజులు గడువిస్తున్నాం..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని అడ్డుకుంటాం..మీకు నిరసన సెగ తప్పదు..
ఎక్సమ్ వాయిదా వేస్తున్నామని ప్రకటన రాకపోతే మా నిరసనలు కొనసాగిస్తాం..
న్యాయస్థానం ఆశ్రయించి లీగల్ గా ముందుకు వెళతాం.
ఆగస్ట్ 7 న జరిగే ఎస్సై ఎక్సమ్ ని వాయిదా వేయాలి..
ఎస్సై ఎక్సమ్ ని వాయిదా వేయాలి బలమురి వెంకట్ నిరసన….
రాష్ట్రమంతటా సర్కార్ బడి కార్యక్రమం టిఎన్ఎస్ఎఫ్…
తెలంగాణ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా సర్కార్ బడి కార్యక్రమం చేపట్టిన వారు దాన్ని డిమాండ్ను ప్రభుత్వం పరిశీలించిన ఎడల ఈరోజు తెలంగాణ ప్రభుత్వ విద్యా కమిషన్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ తెలుగు యువత సాయి టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తెలుగు యువత నాయకులు అరెస్టు చేయడం జరిగింది
రికార్డ్ స్ధాయిలో పతనమైన రుపాయి, ఇది పూర్తిగా మోడీ సర్కార్ వైఫల్యమా??
[IT_EPOLL id=”2734″][/IT_EPOLL]
ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న
ఈటల రాజేందర్…
వరంగల్..
నేడు రేపు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న
ఈటల రాజేందర్…
నేడు ఉదయం శామీర్ పేట నుండి
10am కు కాటరం చేరుకుంటారు..
భూపాలపల్లి జిల్లా కాటారం,మహదేవ్ పూర్ మండలాల్లోనీ వరద ముంపు ప్రాంతాలను సందర్శిస్తారు..
అనంతరం భూపాలపల్లి లో బీజేపీ సమావేశంలో పాల్గొంటారు..
రేపు ములుగు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు..
ఏటూరునాగారం మంగపేట వాజేడు వెంకటాపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు..
జనగాం జిల్లా పాలకుర్తి లో బీజేపీ నాయకుల సమావేశానికి హాజరవుతారు..
భారీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్న పినపాక..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్న పినపాక మండలం లోని పలు గ్రామాల వ్యవసాయ క్షేత్రాలలో బయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణ్ రావు పర్యటించారు. చింతల బయ్యారం, రావి గూడెం, బయ్యారం పంచాయతీలోని నాటుకు సిద్ధంగా ఉండి గోదావరిలో మునిగి కొట్టుకుపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. సోమవారం బయ్యారం గ్రామానికి చెందిన రైతు బ్రహ్మారెడ్డి సాగుచేస్తున్న నీట మునిగిన వరి నారుమడి తో పాటు పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.అనంతరం ఏఈవో లక్ష్మణరావు మాట్లాడుతూ.. వరద ముంపు ప్రాంతాల్లోని నీటమునిగిన వివిధ రకాల పంటలను పరిశీలిస్తున్నామని, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం పంటలు ఇంకా నారు దశలో ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని లక్ష్మణ్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం….
ఎంపీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం….
తెలంగాణలో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరద పరిస్థితిపై చర్చించేందుకు.
రాష్ట్రంలోని విపరీత వరద పరిస్థితుల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరియు తీవ్రంగా నష్టపోతున్నారు.
11 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి.
తెలంగాణ పరిస్థితి జాతీయ విపత్తు గా ప్రకటించి 2000 కోట్ల తక్షణ సహాయ ప్యాకేజీ ఇవ్వాలి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాల నష్టాలను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి.
విధ్వంసకర వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సీతక్క…
కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే ఓటు వేశాను: ఎమ్మెల్యే సీతక్క
నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే నడుచుకుంటానని… క్రాస్ ఓటింగ్ చేసే అలవాటు నాకు లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఓటు వేసే క్రమంలో బ్యాలెట్ పేపర్లో పేర్లు ఉన్న చోట కాకుండా మరో చోట ఇంకు పడిందని… దీంతో కొత్త బ్యాలెట్ పేపర్ అడుగగా, వారు ఇవ్వకపోవడంతో అదే బ్యాలెట్ ను బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే తాను ఓటు వేసినట్లు సీతక్క పేర్కొన్నారు.