Monday, December 23, 2024
Home Blog Page 60

మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం..

0

నవ యువ తెలంగాణ:మహబూబాబాద్ టౌన్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం
పది రోజుల క్రితం అనారోగ్య బారిన పడి నరసింహులపేట మండలం కౌసల్య దేవి పల్లి కి చెందిన ఏర్పుల యాకయ్య ఆసుపత్రిలో చేరిక
వైద్యం సరిగా అందక ఎప్పుడు మృతి చెందాడో కూడా తెలియని దుస్థితి
మృతుడి కుటుంబీకులు పరిశీలించి వైద్యులకు చెప్పే అంతవరకు తిరిగి చూడని వైనం.
వైద్యుల నిర్లక్ష్యం తోనే మృతి చెందాడని కుటుంబీకులు ఆందోళన
ఠాగూర్ సినిమాని తలపించిన మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్వాకం
వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబంతో పాటు పలురు డీమాండ్

అర్ధరాత్రి అధికారుల ఆకస్మిక సందర్శన…!!

0

నవయువ తెలంగాణ: గూడూర్

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని
బాలుర వసతిగృహాన్ని తనిఖీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు..

గూడూరు మండలంలోని బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహం లో
కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురి అయిన విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా
స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కదిలిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వసతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు విద్యార్థులతో మాట్లాడి సంఘటన తీరుపై అడిగి తెలుసుకుంటున్నారు అర్ధరాత్రి హాస్టల్ నీ తనకి చేసిన వారిలో డిప్యూటీ డైరెక్టర్ మంకిడి ఎర్రయ్య తహసిల్దార్ అశోక్ కుమార్ ఏటీడీవో భాస్కర్ సందర్శించార అయోధ్య పురం పీహెచ్సీ వైద్యులు సాయినాథ్ వైద్య సిబ్బంది తదితరులు సందర్శించారు…

మహిళా ఎస్సెపై హోంగార్డు అత్యాచారం…!!

0

మహిళా ఎస్సెపై హోంగార్డు అత్యాచారం

TS: హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దారుణం జరిగింది. తనపై హోంగార్డు అత్యాచారం చేశాడని మహిళా ఎస్సై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యూస్ లో మత్తుమందు కలిపి రేప్ చేశాడని పేర్కొంది. మొబైల్ వీడియో తీసి రూ.50,00,000 డిమాండ్ చేస్తున్నాడని తెలిపింది.

మెగా వైద్య శిబిరం నిర్వహించిన వైద్యాధికారి డాక్టర్ త్రిభువన…

0

రాఘవయ్య నగర్ లో మెగా వైద్య శిబిరం నిర్వహించిన వైద్యాధికారి డాక్టర్ త్రిభువన…


స్పెషల్ కరస్పాండెంట్ :- ఉదయ్ సామినేని

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ త్రిభువన శుక్రవారం వెంకటేశ్వర నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నగరంలోని 12వ డివిజన్ అష్టలక్ష్మి గుడి దగ్గర ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి హాజరైన వారికి బిపి కొలెస్ట్రాల్ కిళ్ళు షుగర్ మరియు బూస్టర్ డోస్ వేసి తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ వర్షాలు కురిసిన తదుపరి డెంగ్యూ మలేరియా టైపాయిట్ ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలని తెలిపారు దోమల వ్యాపి నివారణకు తమ పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరరావు, బిక్కసాని జేస్వంత్, ఉట్ల జగన్ మరియు ఆశ వర్కర్లు వెంకటలక్ష్మీ, రమాదేవి, ఎన్ఎం లక్ష్మీప్రసన్న, ల్యాబ్ టెక్నీషియన్ ఉమాదేవి, సూపర్వైజర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కన్నతల్లి సంతకం ఫోర్జరీ చేసిన పెద్ద కొడుకు..???

0

కన్నతల్లి సంతకం ఫోర్జరీ చేసిన పెద్ద కొడుకు

– అత్యుస్తాహం చూపిస్తున్న పోలీసులు

– 67 వయసులో న్యాయం కోసం కాళ్ళు అరిగేలా పోలీసులు, కోర్టు చుట్టూ తిరుగుతున్న తల్లి..
నా పేరు రెడ్డి సులోచన హైదరాబాద్ మీర్ పేట లో ఉంటాను,, సొంత ఊరు గద్దపాక, కేశవపట్నం మండలము కరీంనగర్. ఆమెకి ఇద్దరు కొడుకులు పెద్దకొడుకు విధ్యాధర్ రెడ్డి, చిన్న కొడుకు శశిధర్ రెడ్డి చిన్న కొడుకు 2005 లో ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లి సంపాదిస్తూ ఇంటి పోషణ నిమిత్తం ప్రతినెలా డబ్బులు తల్లి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పంపించేవారు, పెద్ద కుమారుడు తల్లి కి తెలియదనీ తానే ఇంటి భాద్యతలు చూసుకుంటా అని మభ్య పెట్టీ ఏటీఎం కార్డ్ తన దగ్గరే పెట్టుకుని ప్రతి రోజు 10 వేల నుంచి 40,000 వేల దాకా డబ్బులు డ్రా చేస్తూ మోసం చేసి 8 సంవత్సరాల్లో 50 లక్షల దాకా వాడుకున్నాడు తల్లికి తెలిసి 2019 లో నిలదియగా ఆస్తి మొత్తం తనకే కావాలని తల్లిని మానసికం గా శారీరకం గా హింసించడం మొదలు పెట్టాడు తరువాత తల్లి కి తెలియకుండా పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టుకున్నడు బయట నుంచి ఇంటికి వచ్చి రోజు కొడుతూ, భూతులు తిడుతూ ఊరిలో ఉన్న 4 ఎకరాల పొలం తన పేరున పట్టా చేయమని హింసించేవాడు ఈ క్రమం లో ఇంట్లో ఆమెని తిడుతూ చీర కొంగుతో ఉరివేసి చంపే ప్రయత్నం కూడా చెయ్యబోయ్యాడు ఈ విషయం సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఆ రికార్డ్ ఆధారంగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో తల్లి ఫిర్యాదు చేయగా FIR No. 463/2019 కేస్ బుక్ చేశారు పోలీస్ వారి ముందు మంచిగా నటించి ఆరెస్ట్ చేయకుండా చూసుకున్నడు, పోలీస్ వాళ్ళు కూడా సొంత కొడుకు పైన కేసు ఏమిటని తల్లికి సర్ది చెప్పారు తల్లి కూడా సరే అని ఉరుకున్నారు. హైదరాబాదులో కేస్ అయిందని గద్దపాక వచ్చి తల్లి లేని సమయంలో ఇంటి తాళాలు తీసుకొని బీరువాలో ఉన్న ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తల్లి పేరున ఉన్న భూమి పట్టా పాస్ బుక్కులు ఎత్తుకొని వెళ్ళాడు ఈ విషయమై కేశపట్నం పోలీస్ స్టేషన్ నందు రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు ఈ కేసులో ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోవడంతో తల్లి రిజిస్టర్ పోస్టు ద్వారా కేశవపట్నం పోలీసువారికి కమిషనర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పటినుంచి చాలా ఫిర్యాదులు ఇచ్చినా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో హుజురాబాద్ కోర్టు నందు సివిల్ కేసు ఫైల్ చేపించారు తల్లి బతికున్నంత వరకు ఆస్తులు భూములు అనుభవించే హక్కు తల్లికే ఉండాలని కోర్టు ద్వారా పర్మినెంట్ ఇంజక్షన్ ఇవ్వమని, విచారణ చేసి తల్లి వైపున టెంపరరీ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు అయిన కూడా పెద్ద కొడుకు, విద్యాధర అయిన పులికోట విద్యానందం, సురేష్ వాసా, లంకుస్, మాజీ ఎంపీటీసీ పరశురాములు, మాజీ సర్పంచ్ బసవయ్య, కొమురయ్య, దేవునూరి భాగ్యమా, అజయ్ ఇంకా కొందరు గ్రామస్తులతో కుమ్మక్కై తల్లి ని బెదిరిస్తూ దౌర్జన్యంగా పొలం దున్నుకుంటున్నారు ఈ విషయమై కేశవపట్నం పోలీసులకి ఎమ్మార్వో కి ఫిర్యాదు చేసినప్పటికీ ఏ విధమైన చర్య తీసుకోకపోవడంతో ఈ విషయంలో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఊరిలో తల్లిపై దౌర్జన్యం చేసినందుకు హైదరాబాద్ ఏసిపికి ఫోన్ చేసి చెప్పగా విద్యాధర్ నీ అరెస్టు చేసి రంగారెడ్డి కోర్టు నందు రిమాండ్ చేసి చర్లపల్లి జైలులో 14 రోజులు ఉన్నాడు మళ్లీ ఒక సంవత్సరం తర్వాత దేవుని కొమురయ్య భాగ్యమ్మ మా ఊరి సర్పంచు గోపు విజయకుమార్ నీ ఇంటి మీద తీసుకొచ్చి ఎస్సీ వారికి భూమి రిజిస్ట్రేషన్ చేయాలి అని గొడవ చేస్తూ తల్లి పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని బెదిరించారు తల్లి ఏ విధమైన భూమి అమ్మలేదని భూమి అమ్మినట్టు పత్రాలు ఉంటే చూపియమని నిలదీయగా 2009 సంవత్సరంలో రాసినట్టున్న ఒక తెల్ల కాగితం చూపించారు దానిపైన 102 సర్వేనెంబర్ లోని తల్లి పేరును ఉన్న రెండెకరాల ఏడు గుంటల భూమిని తల్లి విద్యాధర్ కలిసి అమ్మినట్టు తల్లి భర్త తమ్ముడు నరేందర్ రెడ్డి సాక్షి సంతకంతో మరికొందరు సాక్షుల సంతకంతో అమ్మినట్టు పత్రం సృష్టించారు ఆ సంతకం నేను పెట్టలేదు నాకు సంతకం తో సంబంధం లేదని తల్లి వెంటనే పోలీసు స్టేషన్ నందు నా సంతకం ఫోర్జరీ చేశారని విద్యాధర్, నరేందర్ రెడ్డి, దేవి నూరి కొమరయ్య, భాగ్యమ్మ వారి పైన ఫిర్యాదు చేసినా పోలీసు వారు ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోవడంతో హుజురాబాద్ కోర్టు నందు ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఫోర్జరీ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేపించారు కోర్టులో తల్లి సంతకాలు తీసుకొని పరీక్ష నిమిత్తం ల్యాబ్ కి పంపించారు రిపోర్టు కోసం పలుమార్లు స్టేషన్లో అడగగా రాలేదని చెప్పారు ఇంతలో చిన్న కొడుకు శశిధర్ జూన్ 30వ తారీఖున పెళ్లి నిమిత్తం అమెరికా నుంచి కుటుంబ సమేతంగా వచ్చాడు జులై 13 తేదీన మేమంతా కలిసి గతపాక వేళ్ళాము 15వ తేదీన శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి కేశవపట్నం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము ఫోర్జరీ కేసు రిపోర్టు వచ్చినందున ఫోర్జరీ పరీక్షల నిమిత్తం మేము ఇచ్చిన ఇంటి పత్రాలు తిరిగి ఇవ్వమని అడిగాము ఎస్ఐ చంద్రశేఖర్ ఫోర్జరీ కేసు ఫైనల్ కాలేదని ఆర్డర్ రాలేదని చెప్పారు మేము ఫోర్జరీ చెయ్యలేదు అని కోర్టులో ప్రూఫ్ అయింది అని అడగగా ఏమీ లేదని చెప్పారు అయినా కొడుకు మీద కేసు లేనిది అన్నారు. 16 వ తారీకు పొద్దున్న విధ్యదర్ పంపించారని భూమి రిజిస్టర్ చేయండి ఫోర్జరీ కేసు లేదు ఎం లేదు అని దేవునూరి భాగ్యమ్మ ఆమె భర్త కొమురయ్య మా ఇంటి పైకి గొడవకి వచ్చారు మేము బయటకి రాలేదు 100 కి డయల్ చేసి పోలీస్ కి పిలిచే క్రమం లో భయపడి వెళ్ళిపోయారు 17వ తేదీ ఉదయం పోలీస్ వారు మా ఇంటి వచ్చి కులం పేరుతో దూషించామని తప్పుడు కేసు పెట్టి కొన్ని పత్రికలలో పత్రికా ప్రకటన విడుదల చేశారు అది చూసి మేము వెంటనే కరీంనగర్ సీపీని కలిసాము వారు హుజురాబాద్ ఏసిపి కి రిఫర్ చేశారు మేము ఎసిపి ని కలవగా చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఫోర్జరీ కేసులు ఏమి లేవు మీరు ఆ భూమి వారికి రిజిస్ట్రేషన్ చెయ్యండి అంటూ లేకుంటే మీ పై కేసులు పెట్టి జైలుకు పంపిస్తా అంటూ భయబ్రాంతులకు గురి చేయడంతో ఎం చెయ్యాలో అర్ధంకాని పరిస్థితి లో పోలీసులు న్యాయం చేస్తారు అని నమ్మితే వాళ్ళు ఈ విధంగా చెయ్యడం కరెక్ట్ కాదు, నాకు పసుపు కుంకుమ కింద 10 ఎకరాల భూమి వస్తే ఇద్దరు కొడుకులను చదివించటానికి కోసం అమ్మేసాను, పిల్లలని కరీంనగర్, హైదరాబాద్ తీసుకుని వచ్చి ఇల్లు కిరాయికి తిసుకుని బట్టలు కుట్టి ఇల్లు నడిపించాను,పెద్ద కొడుకు మాత్రం పోలీస్ వారితో కుమ్మక్కు అయ్యి ఇలా మానసిక వేదన కి గురిచేస్తూ కుట్రపూరిత కేసులు పెడుతూ జీవిత చివరిదశలో నేను ప్రశాంత జీవితాన్ని గడిపే హక్కుని కాల రాస్తునాడు అని ఇప్పటికైనా విచారణ చేసి మాకు న్యాయం చెయ్యండి, విధ్యాధర్ ఫోన్ కాల్స్ ఎంక్వైరీ చేస్తే అతను ఎప్పుడు ఊరిలోకి వచ్చాడు, కేస్ పెట్టిన 3 సంవత్సరాల నుండి కేశవ పట్నం పోలీస్ వారికి, హుజురాబాద్, ఏసిపి గారికి, కరీంనగర్ కలెక్టర్ గారికి,RDO, MRO, గార్లకి ఉన్న లావాదేవీలు అన్ని బహిర్గతం ఔతాయి, కావున న్యాయపరమైన విచారణ చేయాలి అంటూ తల్లి, చిన్నకొడుకు ముఖ్య మంత్రి గారిని, డీజీపీ గారిని వేడుకుంటున్నారు.

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న పేదింటి భిడ్డ నోముల రాజు..

0

హైదరాబాద్ లోని రవింద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15 వ స్నాతకోత్సవ సమావేశంలో బాగంగా ఇటివల భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సామాన్య పేదకుటుంబానికి చెందిన హమాలి పని చేసుకుని జీవించే నోముల మొగిలి – రాద దంపతుల కుమారుడు నోమల రాజు జాంబ పురాణం,కథకుల కథలు – తులనాత్మక అద్యయనం అనే అంశంపై ఫ్రొపెసర్ భట్టు రమేష్ పర్యవేక్షణలో అద్యయనం చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి డాక్టరేట్ మరియు గోల్డ్ మోడల్ పొందారు.అందుకు సంబందించిన పట్టాను నిన్న రవింద్ర బారతీలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరీరాజన్ చేతుల మీదుగా నోముల రాజు అందుకున్నారు.ఈ సందర్బంగా గవర్నర్ అతన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు..

మారు మూల గ్రామంలో సామాన్యపేదకుటుంబంలో జన్మించి,చదువుపై ఉన్న మక్కువతో శ్రద్దగా చదివి నేడు గవర్నర్ చేతుల మీదుగా పీ.ఎచ్ డీ పట్టా,గోల్డ్ మెడల్ పొందడం పట్ల చల్లగరిగే గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..

0

విశాఖలో ప్రొఫెసర్‌ మురళి దారుణ హత్య గురయ్యాడు. మారికవలసలోని రైల్వే బ్రిడ్జి దగ్గర ప్రొ.మురళి మృతదేహం లభ్యమైంది. పది రోజుల క్రితమే మురళి హత్యకు గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. మురళి ఆఫ్రికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న ఆఫ్రికా నుంచి విశాఖకు వచ్చిన మురళిని.. భార్య మృదుల తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. హత్య తర్వాత తన భర్త అదృశ్యమైనట్టు సీఎంపాలెం పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. మృదులపై అనుమానంతో పోలీసులు ప్రశ్నించగా… తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. మృదుల ప్రియుడు శంకర్‌ను అరెస్ట్‌ పోలీసులు చేశారు…!!

కేంద్రం మరో షాక్.రైళ్లలో సీనియర్ సిటీజన్ల రాయితికి మంగళం..!!

0

కేంద్రం మరో షాక్.

సీనియర్ సిటీజన్లకు షాకిచ్చిన రైల్వేశాఖ

రైళ్లలో సీనియర్ సిటీజన్ల రాయితికి మంగళం

దిల్లీ:సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది.రైల్వే టికెట్ దరాలపై వృద్ధులకిచ్చే రాయితిని పునరుద్ధరించబోమని స్పష్టం చేసింది. కోవిడ్ పరిస్థితుల నేపత్యంలో అన్నీ రాయితిలనూ రద్దు చేసిన రైల్వేశాఖ..కొన్నింటిని మాత్రమే పునరుద్ధరించింది. దీంతో వృద్ధులకిచ్చే రాయితిని పునరుద్ధరించాలని డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రయటన చేసింది. గతంతో కొనసాగించిన అన్ని రాయితీలను తిరిగి పునరుద్దరించే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

పాపం కేసీఆర్ కు ఎన్ని కష్టాలొచ్చినయ్‌..! వైఎస్‌ షర్మిల

0

పాపం కేసీఆర్ కు ఒక వరదకే ఎన్ని కష్టాలొచ్చినయ్‌ అంటూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ల అణచివేతలైపోయాయి.. ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయాయంటూ విమర్శించారు. తిరుగుబాటుదారుల వెన్నుపోట్లు, జాతీయ పార్టీల జిమ్మిక్కులు కూడా అయిపోయాయని పేర్కొన్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయింది, ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలయ్యాయంటూ షర్మిల ట్వీట్‌ చేశారు.