Monday, December 23, 2024
Home Blog Page 59

సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక డబుల్‌ బెడ్‌రూం స్కీమ్‌: మంత్రి వేముల

0

హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పథకం సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. వంద శాతం సబ్సిడీతో పేదలకు ఇండ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి, లబ్ధిదారుల ఎంపికపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, హౌసింగ్‌ ప్రత్యేక కార్యదర్శి సునీల్‌ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పూర్తయిన ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక వేగంగా, పారదర్శకంగా జరగాలని అధికారులకు మంత్రి వేముల సూచించారు. అర్హులకు మాత్రమే రెండు పడక గదుల ఇండ్లు అందేలా చూడాలన్నారు. నిర్మాణ తుది దశలో ఉన్న ఇండ్లు వెంటనే పూర్తిచేయాలని సూచించారు. కాగా, డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణ ప్రగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై మంత్రి వేముల బుధవారం కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 2,91,057 ఇండ్లను మంజూరు చేయగా, అందులో 1,29,528 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు. మరో 58,350 ఇండ్ల నిర్మాణం తుదిదశకు చేరుకోగా, మిగిలిన 40,651 ఇండ్ల నిర్మాణం పనులు వివిధ దశలో ఉన్నాయని వివరించారు. పేదల డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.11,614.95 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పేదల కోసం రూ.19,328.32 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో 2,91,057 డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను మంజూరు చేసినట్టు, ఇందులో 2,28,529 ఇండ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.5.76కోట్లు

0

శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత మధ్య గురువారం ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు చేశారు. గత 22 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మెక్కులు, కానుకలతోపాటు అన్నదాన భవనంలోని హుండీలో వేసిన మెక్కులు నగదు రూపంలో రూ.5,76,42,564 ఆదాయంగా వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. వీటితోపాటు 391 గ్రాముల బంగారం, 8.410 కిలోల వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మెక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్తీకమాసం సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు వేడుకలను కనుల పండువలా నిర్వహించారు.

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.5.76కోట్లు

0

శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత మధ్య గురువారం ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు చేశారు. గత 22 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మెక్కులు, కానుకలతోపాటు అన్నదాన భవనంలోని హుండీలో వేసిన మెక్కులు నగదు రూపంలో రూ.5,76,42,564 ఆదాయంగా వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. వీటితోపాటు 391 గ్రాముల బంగారం, 8.410 కిలోల వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మెక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్తీకమాసం సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు వేడుకలను కనుల పండువలా నిర్వహించారు.

కుందూరు మాలకొండయ్య కుటుంబాన్ని పరామర్శించిన కావలి మాజీ శాసనసభ్యులు ఒంటరి వేణుగోపాల్ రెడ్డి

0

మాలకొండయ్య కుమారుడు కుందూరు కొండయ్య ఎంపిటిసి కుందూరు రమణమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు..మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మాల కొండయ్య మరణం కలచి వేస్తుందని ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు..మాలకొండయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు

ప్రతి అమావాస్య రోజున అన్నదానం: ప్రకాష్ గుప్త, వైకుంఠం

0
ఎల్బీనగర్: ప్రతి అమావాస్య రోజున పేదలకు అన్నదానం చేస్తున్నామని రేషన్ డీలర్ ప్రకాష్ గుప్త, వైకుంఠం అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం బైరామల్ గూడ చౌరస్తాలో ఉన్న రేషన్ షాపు వద్ద రేషన్ డీలర్ ప్రకాష్ గుప్త, వైకుంఠం ఆధ్వర్యంలో బుధవారం అమావాస్య రోజున పేదలకు అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ గుప్త , వైకుంఠం మాట్లాడుతూ కాలనీవాసులు, మిత్రుల సహకారంతో ప్రతి అమావాస్య రోజున అందరికి కులమతాలకతీతంగా ప్రతిఒక్కరికీ అన్నదానం చేస్తున్నామని వివరించారు. గతకొన్ని నెలలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతున్నామని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, సీఎస్.ఆంజనేయులు, గోపాల్ గుప్త, శ్రీకాంత్, చంద్రశేఖర్, వరుణ్ కుమార్, గడ్డం మల్లేష్, పవన్, ఎం.ఆంజనేయులు, సి.దస్తయ్య, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల లో గుట్కా అక్రమ నిల్వ ,సరఫరా పై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం

0

ఒకరి అరెస్ట్ , 65,000/- నిషేదిత గుట్కా స్వాధీనం …

ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో గుట్కా పై ప్రత్యేక నిఘా, దాడులు …

వివరాలు వెల్లడించిన సీసీఎస్ సిఐ కిరణ్ …

రూరల్ మండలంలోని సంగంపల్లి,తిప్పన్నపేట కేంద్రంగా గుట్కా నిల్వ చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాలకు , షాపులకు అక్రమంగా సరఫరా చేస్తున్న *పల్లెర్ల జలేందర్* అనే వ్యక్తిని పట్టుకొని ,అతని వద్ద నుండి 65,000/- విలువగల గుట్కా స్వాధీనం చేసుకొని రూరల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు …

ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా గుట్కా అక్రమ నిల్వ ,రవాణా ,సరఫరా మరియు అమ్మకాలపై పూర్తిగా నిఘా ఉంచడం జరిగిందని , గుట్కా వ్యాపారం చేస్తున్న వారి వివరాలు సేకరించడం జరిగిందని త్వరలోనే వారిపై దాడులు చేసి ,గుట్కా అరికట్టడానికి పూర్తి చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు …

ఈ కార్యక్రమంలో సీసీఎస్ సిఐ కిరణ్,ఎస్సై రవీందర్ ,హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావు, కానిస్టేబుల్ సత్యనారాయణ పాల్గొన్నారు …

అనంచిన్ని..
కారుపై దాడి చంపటమే లక్షమా.?

0

అనంచిన్ని..
కారుపై దాడి

★ కాపాడిన జర్నలిస్టుల సమావేశం

★ తప్పిన పెను ప్రమాదం

★ చంపటమే లక్షయమా.?

హైదరాబాద్ (నవ యువ తెలంగాణ)

తెలుగు ప్రజలకు పరిచయం అవసరంలేని జర్నలిస్ట్, పరిశోధన పాత్రికేయంలో తనదైన ముద్ర, కుంభకోణాలు రాయటంలో ఆరితేరిన యోధుడు, డబ్బు ప్రలోభానికి లోను కాడు, అహంకారం ఉండదు, ఆహార్యం మారదు, మొఖంలో చిరునవ్వు చెరగదు, బెదిరింపులకు భయపడడు, రాసిన రాతలకు జైళ్ళ నోళ్ళు తెరిస్తే ఆనందంగా వందల పుస్తకాలతో జైళ్ళకు వెళతాడు. స్వాతంత్ర్య పోరాటం తర్వాత పరిశోధన వార్తల కారణంగానే అత్యధిక రోజులు జైళ్ళలో గడపిన అద్భుతమైన చెరగని చరిత్ర. కనీసం ఒక్కరోజు కూడా జైళ్ళో జైలు కూడు తినని పట్టుదల, భౌతిక దాడులు కొత్త కాదు, మరణానికి వెరవని ధైర్యం ఆయన సొంతం. నిఖార్సయిన వార్తలకు ఆయన కేరాఫ్ అడ్రస్ వెరసి ఆయన పేరు అనంచిన్ని వెంకటేశ్వరరావు.

అసలేం జరిగింది.?

గత కొన్ని రోజులుగా అనంచిన్ని వెంకటేశ్వరరావు ‘ప్రీ లాంచ్’ ఎలాంటి అనుమతులు లేకుండా వేలాది ఠోట్లు కొల్లగొట్టిన “రియల్ ఎస్టేట్ ఫేక్” సంస్థలపై వరుస పరిశోధన కథనాలను అందిస్తున్నారు. బెదిరింపులు సహజం. అయితే బెదిరింపులకు భయపడక పోవడంతో కాళ్ళ బేరానికి ఒకరిద్దరు వచ్చారు. ఈ ముసుగులో ఏకంగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. అయితే అది ఎవరు చేసిందనేది ఇంకా నిర్థారణ కాలేదు.

కారుపై దాడి..

అనంచిన్ని వెంకటేశ్వరరావుకు చెందిన వాహనంపై దాడి జరిగింది. అయితే ఆ సమయంలో ఆ వాహనంలో ఎవరూ లేకపోవడంతో కారు అద్దాలు పగలటం మినహా ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ఈ సమయంలో అనంచిన్ని, ఆయన మిత్రులు ‘సేఫ్’ అయ్యారు.

ఇది రెండోసారి..

అనంచిన్ని వెంకటేశ్వరరావుపై దాడి జరగడం ఇది రెండోసారి. ఒకసారి బషీర్ బాక్ ప్రెస్ క్లబ్ వద్ద 2004లో జరిగింది. కేసు ఫైల్ అయింది. నిందితులు ఇప్పటిదాకా దొరకలేదు. ఇటీవల కాలంలో దాడులు తగ్గించి కేసుల లింక్ మొదలెట్టారు. దానికి కూడా అనంచిన్ని వ్యూహాత్మకంగా ‘చెక్’ పెట్టారు. భవిష్యత్తులో ఆ,యా వ్యక్తులు, అధికారులు ‘వందల కోట్లకు ‘డిప్రమేషన్’ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు ఆఫీస్ అసిస్టెంట్ శ్రీకాంత్ తెలిపారు.

సేప్టీ కోసం మరో రెండు కార్లు..

ఇదిలా ఉండగా అనంచిన్ని వెంకటేశ్వరరావుకు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పట్టింపు లేదు. ఉండదు. అందుకే ఆయన భద్రత విషయంలో ‘అనంచిన్ని బ్రాడ్ కాస్టింగ్’ ఏకంగా కొత్తగా విడుదలైన రెండు కార్లను బుక్ చేసింది. ఈ కార్ల ప్రత్యేకత ఏమిటంటే 360 డిగ్రీల కెమెరా నిఘా ఉంటుంది.

మరో వారంలో కొత్త కారు ఇస్తాం..
‘అనంచిన్ని బ్రాడ్ కాస్టింగ్’ సంస్థ తరఫున రెండు కార్లు బుక్ చేసిన మాట యథార్థమని, ఈ అత్యాధునిక కారు కోసం ఏడాదిన్నరద వేచి చూడాలని అయితే పరిస్థితి అంచనాలోకి తీసుకొని మరో వారంలోనే కొత్త కారు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు, తమ కస్టమర్ల విషయంలో తాము పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటామని, కస్టమర్ల కోసం తాము కట్టుబడి ఉంటామని ప్రముఖ కంపెనీ మహేంద్ర బాద్యులు, ప్రముఖ వ్యాపారవేత్త వివిసి రాజు స్పష్టం చేశారు.

తీవ్రంగా ఖండించిన టిజెఎస్ఎస్..

ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావును బెదిరించన ఆడియో ఒకవైపు హల్చల్ చేస్తుండగా దాడి జరగటం పై తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.

లేడీ కానిస్టేబుల్ కోసం గొడవ పడ్డ సిఐ, కానిస్టేబుల్….!!!

0

నవ యువ తెలంగాణ:పోలీసు శాఖలో క్రమశిక్షణకు ప్రాధాన్యత వుంటుంది. ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ విధులు నిర్వహించాలి. తోటి పోలీసులతో వివాదాలకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో లేడీ కానిస్టేబుల్ విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. భీమవరంలో ఇద్దరు పోలీసుల తీరు తీవ్ర వివాస్పదమవుతుంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుండటంతో డిపార్ట్మెంట్ పరువు పోతోంది. తాజాగా భీమవరం వన్ టౌన్ స్టేషన్లో సిఐకి కానిస్టేబుల్ కి మధ్య చెలరేగిన వివాదం ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాజాగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

భీమవరం వన్ టౌన్ సిఐ కృష్ణభగవాన్ స్టేషన్లో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు అక్కడ వారిని అకారణంగా వేధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా రాజేష్ అనే కానిస్టేబుల్ స్టేషన్లోని మరో లేడీ కానిస్టేబుల్ కు బైక్ పై లిఫ్ట్ ఇస్తున్నాడనే కారణంతో అతన్ని వేధించడం మొదలు పెట్టాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయంలో కానిస్టేబుల్ రాజేష్ కు మధ్య ఘర్షణ సైతం చోటు చేసుకుంది. ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

విచారణ అనంతరం సీఐ కృష్ణ భగవాన్ ను వెకెన్సీ రిజర్వ్ కు పంపించడంతో పాటు కానిస్టేబుల్ ను భీమవరం నుంచి మొగల్తూరు స్టేషన్ కు బదిలీ చేసారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు చిన్నచిన్న విషయాలపై ఎక్కువ శ్రద్ధపెడుతూ ఒకరినొకరు కొట్టుకునే స్థితికి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలిసింగ్ తో నేరాలు అదుపు చేయాల్సిన పోలీసుల మధ్య సఖ్యత ఉండట్లేదనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది.