Saturday, December 21, 2024
Home Blog Page 58

సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు : సీహెచ్.వీఆర్కే. మూర్తి

0

ఎల్బీనగర్: సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని వనస్థలిపురం భక్త సమాజం, జై సంతోషిమాత దేవాలయం  సంయుక్త  నిర్వహణలో ఆశ్లేష సర్ప శాంతి హోమ పూజ, రాహు-కేతు, సర్ప గ్రహ దోష పూజలను వేదపండితులు బ్రహ్మశ్రీ దంటూ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు సీహెచ్.వీఆర్కే.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని ఈనెల 29వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ లోని జై సంతోషి మాత దేవాలయ ప్రాంగణంలో జరుగుతుందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు  8919648996,  8919416798 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

అయ్యప్ప పూజలో ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామికి ఘన సత్కారం

0

ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం సచివాలయనగర్ లో మహేష్ స్వామి నివాసంలో జరిగిన శ్రీ అయ్యప్పస్వామి మహా పది పూజ జరిగింది. ఈ పూజలో భక్త సమాజం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి హాజరయ్యారు. ఈ సందర్బంగా నిర్వాహకులు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామిని శాలువాతో సత్కరించారు. ఈ పూజలో పృధ్విరాజ్ గురుస్వామి, శ్రీ మల్లికార్జున భక్త సమాజం శివస్వాములు, అయ్యప్పస్వాములు, భక్తులు పాల్గొన్నారు.

ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష పార్టీల సమావేశం

0

ఎల్బీనగర్: రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఎల్బీనగర్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష పార్టీల నేతలతో భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధికారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు పిసిసి కార్యదర్శి, ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి జక్కడి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం: ముద్దగౌని లక్ష్మిప్రసన్న రామ్మోహన్ గౌడ్

0

ఎల్బీనగర్: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల కమిటీ చైర్మన్ బైగళ్ళ రాము ఆధ్వర్యంలో చంపాపేట చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బి.ఎన్‌.రెడ్డినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బైగళ్ళ రాము, రామ్, లక్ష్మణ్, సాయికిరణ్, సురేష్, ప్రవీణ్, శ్రీకాంత్, గౌస్, పాషా, మహేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాంతాచారి 13వ వర్థంతి వేడుకలను జయప్రదం చేయాలి రాయబండి పాండురంగాచారి, బొంగు వెంకటేష్ గౌడ్

0

ఎల్బీనగర్: తెలంగాణ మలిదశ అమరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కాసోజు శ్రీకాంతాచారి స్మారక కమిటీ చైర్మన్ పాండురంగాచారి, వైస్ చైర్మన్ బొంగు వెంకటేష్ గౌడ్ లు అన్నారు. తెలంగాణ మలిదశ అమరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సభ ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట చౌరస్తాలో ఈనెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్లను కొత్తపేట చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి, తల్లి శంకరమ్మ తదితరులు హాజరవుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లె వినయ్ కుమార్ గౌడ్, చిక్కుళ్ల శివప్రసాద్, మహమ్మద్ ఇస్మాయిల్, మేకల శ్యాంసుందర్, పరుశురాజ్, ఐతగోని పాపయ్య గౌడ్, పాలకూరి నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ సిటీలో సులువైన మార్గం

0

హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులను ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి తప్పించి.. సులువైన ప్రయాణం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ఎస్‌ఆర్‌డీపీ సత్ఫలితాలిస్తున్నది. సిటీ రాస్తాపై ప్రగతి పరుగులు పెడుతున్నది. ఎస్‌ఆర్‌డీపీ పథకం మొదటిదశలో రూ. 8092 కోట్లతో చేపట్టిన47 ప్రాజెక్టుల్లో 33 దిగ్విజయంగా పూర్తి చేశారు. అనేక మార్గాల్లో నిర్మించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్టీల్‌ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, లింకురోడ్లతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతున్నది. గతంలో గంటలు పట్టే ప్రయాణం..ఇప్పుడు నిమిషాల్లోనే..చేరుకోగలుగుతున్నారు. తాజాగా ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా గచ్చిబౌలి వద్ద శిల్పా లేఅవుట్‌ వంతెనను శుక్రవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

3న కొత్తపేటలో శ్రీకాంతాచారి 13వ వర్థంతి వేడుకలు

0

సభను జయప్రదం చేయాలి : రాయబండి పాండురంగాచారి, బొంగు వెంకటేష్ గౌడ్

ఎల్బీనగర్: తెలంగాణ మలిదశ అమరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కాసోజు శ్రీకాంతాచారి స్మారక కమిటీ చైర్మన్ పాండురంగాచారి, వైస్ చైర్మన్ బొంగు వెంకటేష్ గౌడ్ లు అన్నారు. తెలంగాణ మలిదశ అమరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సభ ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట చౌరస్తాలో ఈనెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్ ను ఎల్బీనగర్ కూడలిలో ఉన్న శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శ్రీకాంతాచారి వర్ధంతి  వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్  మధుసూదనాచారి, టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, శ్రీకాంతాచారి  తండ్రి శంకరాచారి తదితరులు హాజరవుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి సేవాదళ్ రంగారెడ్డి జిల్లా నాయకులు లిక్కి వెంకటరెడ్డి, నాయకులు ఈదుల పరుశురాం మాదిగ, పాల్వాయి వేణు తదితరులు పాల్గొన్నారు.

3న కొత్తపేటలో శ్రీకాంతాచారి 13వ వర్థంతి వేడుకలు

0

సభను జయప్రదం చేయాలి : రాయబండి పాండురంగాచారి, బొంగు వెంకటేష్ గౌడ్

ఎల్బీనగర్: తెలంగాణ మలిదశ అమరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కాసోజు శ్రీకాంతాచారి స్మారక కమిటీ చైర్మన్ పాండురంగాచారి, వైస్ చైర్మన్ బొంగు వెంకటేష్ గౌడ్ లు అన్నారు. తెలంగాణ మలిదశ అమరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సభ ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట చౌరస్తాలో ఈనెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్ ను ఎల్బీనగర్ కూడలిలో ఉన్న శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శ్రీకాంతాచారి వర్ధంతి  వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్  మధుసూదనాచారి, టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, శ్రీకాంతాచారి  తండ్రి శంకరాచారి తదితరులు హాజరవుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి సేవాదళ్ రంగారెడ్డి జిల్లా నాయకులు లిక్కి వెంకటరెడ్డి, నాయకులు ఈదుల పరుశురాం మాదిగ, పాల్వాయి వేణు తదితరులు పాల్గొన్నారు.

ఘంటసాల జయంతి సందర్భంగా సినీ, భక్తి గీతాలాపన పోటీలు

0

ఎల్బీనగర్: సంగీత దర్శకులు, గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా వనస్థలిపురం‌ భక్త సమాజం ఆధ్వర్యంలో డిసెంబరు 11వ తేదీన ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో సినీ, భక్తి గీతాలాపన పోటీలను నిర్వహిస్తున్నట్లు వనస్థలిపురం‌ భక్త సమాజం అధ్యక్షులు సీహెచ్.వీఆర్కే.మూర్తి, ప్రధాన కార్యదర్శి వి.సూర్యప్రకాష్ లు తెలిపారు. ఆసక్తి గల వర్తమాన గాయకులు ముందుగా తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అధ్యక్షులు మూర్తి 89194 16798 సెల్ నెంబరులో సంప్రదించాలని వారు సూచించారు.

జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా రూ.50వేల జరిమానా

0

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా, దాడి చేసినా 50వేల రూపాయల జరినామా ఐదేళ్ల కఠిన కాలగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తీర్పుతో పలువురు జర్నలిస్టు తమ వృత్తిపరంగా ఎలాంటి భయాందోళన గురికాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు సీనియర్ జర్నలిస్టులు ఈ తీర్పును ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకుల నుండి ఒకింత రక్షణ ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.