హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులను ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించి.. సులువైన ప్రయాణం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ఎస్‌ఆర్‌డీపీ సత్ఫలితాలిస్తున్నది. సిటీ రాస్తాపై ప్రగతి పరుగులు పెడుతున్నది. ఎస్‌ఆర్‌డీపీ పథకం మొదటిదశలో రూ. 8092 కోట్లతో చేపట్టిన47 ప్రాజెక్టుల్లో 33 దిగ్విజయంగా పూర్తి చేశారు. అనేక మార్గాల్లో నిర్మించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, లింకురోడ్లతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతున్నది. గతంలో గంటలు పట్టే ప్రయాణం..ఇప్పుడు నిమిషాల్లోనే..చేరుకోగలుగుతున్నారు. తాజాగా ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా గచ్చిబౌలి వద్ద శిల్పా లేఅవుట్ వంతెనను శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.