గ్రేట్ తెలంగాణ దేవరకొండ ప్రతినిధి.
పీఏపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్ లో నిన్నటి నుంచి ఫుడ్ పాయిజన్ వల్ల అనారోగ్య పరిస్థితి ఏర్పడి దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసి విద్యార్థితో మాట్లాడారు.డాక్టర్ తో కూడా మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆస్పత్రి ఆవరణలో ఆర్డిఓ ఉండగా ఆర్డిఓ గారిని మోడల్ స్కూల్ విద్యార్థులపై వివరాలు తెలుసుకొని తక్షణమే సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. మోడల్ స్కూల్లో సరైన మెనూ పాటించకుండా పౌష్టికి ఆహారం లోపం వల్ల పురుగు ఉన్నటువంటి స్టాక్ బియ్యం సమయపాలన భోజనం అందించకపోవడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురై అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. నియోజకవర్గంలో అయినటువంటి అన్ని హాస్టల్లో సందర్శించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ పేద విద్యార్థులు చదువుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడడం వలన చదువుకు దూరమై పరిస్థితి నెలకొంటుంది. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ న్యాయం చేయాలి. చేయని యెడల పెద్ద ఎత్తున వందలాది మంది విద్యార్థులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్, ఆర్డిఓ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చోల్లేటి భాస్కరాచారి, బహుజన మేధావి డాక్టర్ ఏకుల రాజారావు,మాకం చంద్రమౌళి, లౌడియ భాష నాయక్, ముసిని సత్యం తదితరులు పాల్గొన్నారు.