కవిమిత్ర” పురస్కారానికి ఎంపికైన యం.అశోక్ కుమార్
*కవిమిత్ర” పురస్కారానికి ఎంపికైన యం.అశోక్ కుమార్.
కరీంనగర్ గ్రేట్ తెలంగాణ న్యూస్.
భవాని సాహిత్య వేదిక, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో 8 వ తేదీ డిసెంబర్ 2024 ఆదివారం రోజున హైదరాబాద్ కు చెందిన కవి శ్రీ M.అశోక్ కుమార్ గారికి “కవి మిత్ర” పురస్కారం ప్రదానము చేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు శ్రీ అశోక్ కుమార్ గారికి ఆహ్వాన పత్రం అందించారు.
శతాధిక కవులతో ఈ నెల 8 వ తేదీన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్, కరీంనగర్ లో జరుగనున్న జాతీయ సాహిత్య సంబరాల కార్యక్రమంలో ఘన సత్కారాన్ని, ప్రశంసా పత్రాన్ని అందించడంతో పాటు “కవి మిత్ర” పురస్కారాన్ని స్వీకరించాలని వారి ఆహ్వాన పత్రికలో తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 200 మంది కవులు, రచయితలు హాజరు కానున్నారని తెలిపారు.లబ్ద ప్రతిష్టులైన సాహితీవేత్తలు, ప్రముఖుల మధ్య జరుగు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం లభించడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నట్లు శ్రీ అశోక్ కుమార్ గారు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భవాని సాహిత్య వేదిక, కరీంనగర్ అధ్యక్షులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం ఏర్పడిన విద్యార్థిని పరామర్శించి మోడల్ స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్.
గ్రేట్ తెలంగాణ దేవరకొండ ప్రతినిధి.
పీఏపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్ లో నిన్నటి నుంచి ఫుడ్ పాయిజన్ వల్ల అనారోగ్య పరిస్థితి ఏర్పడి దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసి విద్యార్థితో మాట్లాడారు.డాక్టర్ తో కూడా మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆస్పత్రి ఆవరణలో ఆర్డిఓ ఉండగా ఆర్డిఓ గారిని మోడల్ స్కూల్ విద్యార్థులపై వివరాలు తెలుసుకొని తక్షణమే సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. మోడల్ స్కూల్లో సరైన మెనూ పాటించకుండా పౌష్టికి ఆహారం లోపం వల్ల పురుగు ఉన్నటువంటి స్టాక్ బియ్యం సమయపాలన భోజనం అందించకపోవడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురై అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. నియోజకవర్గంలో అయినటువంటి అన్ని హాస్టల్లో సందర్శించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ పేద విద్యార్థులు చదువుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడడం వలన చదువుకు దూరమై పరిస్థితి నెలకొంటుంది. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ న్యాయం చేయాలి. చేయని యెడల పెద్ద ఎత్తున వందలాది మంది విద్యార్థులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్, ఆర్డిఓ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చోల్లేటి భాస్కరాచారి, బహుజన మేధావి డాక్టర్ ఏకుల రాజారావు,మాకం చంద్రమౌళి, లౌడియ భాష నాయక్, ముసిని సత్యం తదితరులు పాల్గొన్నారు.
మాలల ఆత్మగౌరవ సభకు బయలుదేరిన మాల మహానాడు నాయకులు.
గ్రేట్ తెలంగాణ దేవరకొండ ప్రతినిధి.
దేవరకొండ నియోజకవర్గం అన్ని మండలాల్లోని అన్ని గ్రామాలలో మాలలు నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఏకల రాజారావు దేవరకొండ నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షులు, కన్వీనర్ బోయి నీ చంద్రమౌళి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నల్లగొండలో సాగర్ రోడ్ లోని జూలకంటి ఇంద్రారెడ్డి గార్డెన్స్ లో జరిగే మాలల ఆత్మగౌరవ సభకు వందలాదిగా మాలలు దేవరకొండ నియోజకవర్గం నుండి తరలి వెళ్లారు 2024 ఆగస్టు ఒకటో తారీకు నాడు ఎస్సీ వర్గీకరణ కనుకూలంగా సుప్రీంకోర్టు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని ఇచ్చిన తీర్పు కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని మాలలు అందరు ఒక్క తాటి పైకి వచ్చి మాలలు చైతన్యం చేస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ కూడా ఎస్సీ వర్గీకరణ కాదు ఎస్సీ 15 శాతం రిజర్వేషన్ 25% పెంచాలని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిండి మండలం మాల మన అధ్యక్షులు నారిమల మల్లేష్ మండల కన్వీనర్ నూనె ప్రసన్న కుమార్ దేవరకొండ మండల కో కన్వీనర్ చెన్నయ్య గ్రామాల కన్వీనర్లు మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు
పేద విద్యార్థులకు చేయూత.
విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నుల పంపిణీ
నారాయణపేట: గ్రేట్ తెలంగాణ న్యూస్
పేద విద్యార్థులను ఆదుకునేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు తిప్పన్న, సుదర్శన్ రెడ్డి అన్నారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేటలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్ వాడి పాఠశాల, తదితర పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను అందజేయడం జరిగిందని తెలిపారు. భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించి వారికి విద్యాబుద్ధులను నేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పేదలకు చేయూతనిచ్చేందుకు తమ సంస్థ ఎనలేని కృషి చేస్తుందని వారు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బాలాజీ, నరసింహ, శివరాజ్, శ్రీనివాస్, హనుమంతు, సంతోష్, గోపాల్, అధిక సంఖ్యలో సభ్యులు, స్థానికులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్.జె.పీ.ఐ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా జటావత్ నరేష్ నాయక్
ఎస్.జె.పీ.ఐ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా జటావత్ నరేష్ నాయక్.
ఎల్బీనగర్: గ్రేట్ తెలంగాణ న్యూస్
సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా జటావత్ నరేష్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కేవీ గౌడ్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కేవీ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చామకూర రాజు ఆదేశాల మేరకు జటావత్ నరేష్ నాయక్ ను తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడం జరిగిందని తెలిపారు. నూతనంగా నియమితులైన జటావత్ నరేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, ఆయా సమస్యలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి పాటుపడతానని అన్నారు. తనను పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కేవీ గౌడ్, జాతీయ అధికార ప్రతినిధి వేముల కొండల్ గౌడ్ తదితరులకు జటావత్ నరేష్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
నేతలు మారుతున్న ఈ ఊరు రోడ్డు మారడం లేదు…
నేతలు మారుతున్న ఈ ఊరు రోడ్డు మారడం లేదు…
గ్రేట్ తెలంగాణ న్యూస్ తుంగతుర్తి:-
సాక్షాత్తు నల్లగొండ జిల్లా మంత్రి రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట ఇచ్చిన రోడ్డు పరిస్థితి మారడం లేదు!?
అంటే మంత్రి మాటకు లెక్క లేదా!?
ఇచ్చిన మాట మరచిపోయాడా!?
రాజకీయ నాయకుల మాటలకు విలువ లేదన్నమాట!?
తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఊరు బాగుపడింది గాని ఈ ఊరు బాగుపడతలేదని ప్రజల ఆవేదన!?
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు గెలవగానే తన ఊరికి రోడ్డు వేయించుకున్నాడు. కానీ ఇప్పుడు రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇటుకులపాడు గ్రామంలో శివుని టెంపుల్ ప్రారంభోత్సవం చేసి శివుని సాక్షిగా చెప్పిన మాట ఏమైపోయింది!? అధికారం రాగానే మరిచిపోయారా!? తర్వాత చూద్దాంలే చేద్దాంలే అనే ఆలోచన!? ఏదేమైనా తరాలు మారుతున్న నాయకులు మారుతున్న ప్రభుత్వాలు మారుతున్న రహదారి బ్రతుకు చిత్రం మారటం లేదు..! ఇటుకలపాడు గ్రామంలో అందరూ నేతలే… !
నెరిసిన జుట్టు రాజకీయ అనుభవం అపారమైంది. అందుకే ఈ రోడ్డుకు ఈ దాపురీకం ఇలా శనిల వెంటపడుతుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే మందులు సామేలు రోడ్డుకు సరైన సమయం కేటాయించి రహదారి సరి చేయకుంటే రాబోయే రోజుల్లో చావు తప్పి కన్నులు లొట్ట పోయినట్టు ఆరోపణలు శాపనార్ధాలు ఎన్నో మూట పెట్టుకోవడం తప్పదు… మనోడని మంచం ఎక్కిస్తే ఉచ్చ పోసినట్టు అయిపోయినంత పని అయిందని ఇటుకలపాడు ప్రజలు శాపనార్ధాలు పెడుతున్నారు…
ఆటో డ్రైవర్స్ కు దుస్తులు పంపిణీ.
మానవత్వం చాటుకున్న హోం గార్డ్ : బీ గోపాల్.
కేపీ హెచ్ బీ. గ్రేట్ తెలంగాణ న్యూస్.
అడ్డ గుట్ట ప్రగతి నగర్ ఆటో స్టాండ్ యూనియన్ అధ్యక్షుడు జమిల్ గారికీ ట్రాఫిక్ హోంగార్డు బి. గోపాల్ యూనిఫాంను అందజేశారు ఆటో డ్రైవర్స్ కు దాదాపు 15 మందికి దుస్తులు పంపిణీ చేసి. ప్రతీ ఒక్కఅటో డ్రైవర్ తప్పకుండా యూనిఫాం ధరించాలని ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. లైసెన్స్ లేకుండా మందు తాగి అటో నడపవద్దు. ప్రమాదకరంగా రాంగ్ రూట్ వెళ్ళవద్దు. ట్రాఫిక్ సిగ్నల్ ను కచ్చితంగా పాటించాలి. సెల్ పోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చెయ్యవద్దు. ప్రజలతో మర్యాదగా పూర్వకంగా మాట్లాడాలి అలాగే ట్రాఫిక్ నియమాలు ఉల్లంగించకుండ పోలీసులకు సహకరించాలని కోరారు,ఈ కార్యక్రమములో ట్రాఫిక్ కానిస్టేబుల్ కృష్ణ, ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులూ తదితరులు పాల్గొన్నారు.
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ లను తక్షణమే అమలు చేయాలి.
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ లను రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే అమలు చేయాలి. మాజీ యస్ సీ కార్పొరేషన్ ఛైర్మెన్ పిడమర్తి రవి
పరిగి, అక్టోబరు 20, గ్రేట్ తెలంగాణ న్యూస్.
శుక్రవారం ఉదయం 9:40 నిమిషాలకు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పీడమర్తి రవి పరిగి పట్టణములో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించడానికి వస్తున్నారు ఈ సందర్భం ఎస్సీ రిజర్వేషన్, ఏబిసిడి వర్గీకరణ, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పిడమర్తి రవన్న చేస్తున్న ఉద్యమానికి మాదిగ రాజకీయ నాయకులు. ఉద్యోగస్తులు. విద్యార్థిని, విద్యార్థులు. ప్రజా సంఘాల నాయకులు అందరూ పాల్గొనాలని మాదిగ చైతన్య వేదిక ఒక ప్రకటనలో పేర్కొన్నది.
తెలంగాణ జర్నలిస్ట్ యాంటీ అటాక్స్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దాస్ మాతంగి.
హైదరాబాద్, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి :
ఐజేయూ అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) జర్నలిస్ట్ యాంటి అటాక్స్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దాస్ మాతంగి నియమితులయ్యారు.ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రకటించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మాతంగి దాస్ మూడు దశాబ్దాలకు చేరువగా జర్నలిజం వృత్తిలో ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో సేవలందించి నిర్విఘ్నంగా కొనసాగు తున్నారు. జర్నలిజం తొలినాళ్ళ నుంచి జర్నలిస్టు సంఘంలో సమ్మిళితమవుతూ వేములపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా అరంగ్రేటం చేసి ఇంతింతై వటుడింతై అన్న చందంగా మిర్యాలగూడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షులుగా, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, పదేళ్లు నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, సంఘం రాష్ట్ర కౌన్సిల్, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా, నల్గొండ జర్నలిస్ట్ యాంటి అటాక్స్ కమిటీ సభ్యులుగా వివిధ పర్యాయాలు విశిష్ఠ సేవలందించారు.1995లోనే ఆంధ్రజ్యోతిలో వేములపల్లి కంట్రిబ్యూటర్ గా జర్నలిజం రంగంలోకి అరంగ్రేటం చేసి ఆ తదుపరి వార్త వేములపల్లి, మిర్యాలగూడ రూరల్, మిర్యాలగూడ పట్టణ, కోదాడ స్టాఫ్ రిపోర్టర్, నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, బ్రాంచ్ మేనేజర్, స్టేట్ బ్యూరో, నమస్తే తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్, తెలంగాణ చిన్న మధ్యతరహా డైలీస్, పిరియాడికల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా వివిధ స్థాయిల్లో సేవలందించారు.
ఆ తదుపరి జర్నలిజంలో మూడు దశాబ్దాలుగా అన్న అనుభవాన్ని రంగరించుకొని అక్షిత తెలుగు జాతీయ దిన పత్రికను స్థాపించి చీఫ్ ఎడిటర్ గా… పత్రికను హైద్రాబాద్ కేంద్రంగా ప్రధాన పత్రికలకు ధీటుగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న తనను తెలంగాణ జర్నలిస్ట్ యాంటి అటాక్స్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించడం పట్ల ఐజేయూ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, సంఘం జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, హెచ్ యూజే అధ్యక్షులుగా శిగా శంకర్, తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ ఇతర యూనియన్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సంఘం తనకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యూనియన్ పెద్దల సహకారంతో జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకం పట్ల వివిధ సంఘాల బాధ్యులు, సీనియర్ జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి జర్నలిస్టులకు మరిన్ని సేవలందించాలని పలువురు ఆకాంక్షించారు.
వెంగల మధుసూదన్, గుడిమల్లం పుండరీకం, సిరిపురం సతీష్ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.
అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఛైర్మెన్ చంద్రారెడ్డి.
కీసర, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి,
నాగారం మున్సిపాలిటీ పరిధిలో సత్యనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వెంగల మధుసూదన్ మాట్లాడుతూ…ప్రతిసారి వినాయకుడిని ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరు ఎలాంటి విఘ్నాలు లేకుండా వినాయక చవితి జరుపుకోవాలని కులమతాలకు అతీతంగా ఈ వినాయక నిమజ్జనం జరగాలని అన్నారు, ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పలువురికి అన్నదానం చేసిన ఆయన వినాయకుడు అంటే విజ్ఞాలు లేకుండా చూసేవాడని భక్తి శ్రద్ధలతో వినాయకుడినీ పూజించి ఏది కోరుకుంటే అది జరుగుతుందని అన్నారు.
వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు, యువత ఐకమత్యంగా కలిసి వినాయక చవితి వేడుకలను జరిపించడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని, బాల గంగాధర్ తిలక్ చూపిన దారిలో యువత నడవడం ఎంతో ఆనందంగా ఉందని అయన అన్నారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ పాలనలో ఈ వేడుకలకు ప్రాముఖ్యతను సంతరించుకుందని, తర్వాత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో దేశంలో అందరినీ ఒక్కటిగా చేసేటందుకు బాల గంగాధర్ తిలక్ గణపతి ఉత్సవం, శివాజీ ఉత్సవాలను ప్రారంభించారని, భారతీయుల పూజా మందిరాలలో జరిగే గణేష్ పూజలు, సామూహిక పూజలు సామాజికమైన, సార్వజనీకమైన ప్రాధాన్యతను అందించేందుకు తిలక్ చేసిన కృషి అనన్య సామాన్యం అనీ తలచిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా దిగ్విజయంగా పనులు పూర్తి కావాలంటే ఆ గణనాయకుడిని పూజిస్తే చాలు అని అన్నారు . ఈ రోజు ప్రజలకు అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలను ఛైర్మెన్ ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో అన్న ప్రసాదం దాతలుగా వెంగళ మధుసూదన్, గుడిమల్లం పుండరీకం, సిరి పురం సతీష్ పాల్గొనగా,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, బిజెపి నాయకులు రవీందర్ రెడ్డి, నాగులు, కాలనీ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, అసోసియేషన్ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.