*కవిమిత్ర” పురస్కారానికి ఎంపికైన యం.అశోక్ కుమార్.
కరీంనగర్ గ్రేట్ తెలంగాణ న్యూస్.
భవాని సాహిత్య వేదిక, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో 8 వ తేదీ డిసెంబర్ 2024 ఆదివారం రోజున హైదరాబాద్ కు చెందిన కవి శ్రీ M.అశోక్ కుమార్ గారికి “కవి మిత్ర” పురస్కారం ప్రదానము చేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు శ్రీ అశోక్ కుమార్ గారికి ఆహ్వాన పత్రం అందించారు.
శతాధిక కవులతో ఈ నెల 8 వ తేదీన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్, కరీంనగర్ లో జరుగనున్న జాతీయ సాహిత్య సంబరాల కార్యక్రమంలో ఘన సత్కారాన్ని, ప్రశంసా పత్రాన్ని అందించడంతో పాటు “కవి మిత్ర” పురస్కారాన్ని స్వీకరించాలని వారి ఆహ్వాన పత్రికలో తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 200 మంది కవులు, రచయితలు హాజరు కానున్నారని తెలిపారు.లబ్ద ప్రతిష్టులైన సాహితీవేత్తలు, ప్రముఖుల మధ్య జరుగు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం లభించడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నట్లు శ్రీ అశోక్ కుమార్ గారు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భవాని సాహిత్య వేదిక, కరీంనగర్ అధ్యక్షులు శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.