ఎస్.జె.పీ.ఐ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా జటావత్ నరేష్ నాయక్.
ఎల్బీనగర్: గ్రేట్ తెలంగాణ న్యూస్
సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా జటావత్ నరేష్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కేవీ గౌడ్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కేవీ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చామకూర రాజు ఆదేశాల మేరకు జటావత్ నరేష్ నాయక్ ను తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడం జరిగిందని తెలిపారు. నూతనంగా నియమితులైన జటావత్ నరేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, ఆయా సమస్యలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి పాటుపడతానని అన్నారు. తనను పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కేవీ గౌడ్, జాతీయ అధికార ప్రతినిధి వేముల కొండల్ గౌడ్ తదితరులకు జటావత్ నరేష్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.