ఎల్బీనగర్: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల కమిటీ చైర్మన్ బైగళ్ళ రాము ఆధ్వర్యంలో చంపాపేట చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బి.ఎన్.రెడ్డినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బైగళ్ళ రాము, రామ్, లక్ష్మణ్, సాయికిరణ్, సురేష్, ప్రవీణ్, శ్రీకాంత్, గౌస్, పాషా, మహేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం: ముద్దగౌని లక్ష్మిప్రసన్న రామ్మోహన్ గౌడ్
RELATED ARTICLES