ఎల్బీనగర్: సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని వనస్థలిపురం భక్త సమాజం, జై సంతోషిమాత దేవాలయం సంయుక్త నిర్వహణలో ఆశ్లేష సర్ప శాంతి హోమ పూజ, రాహు-కేతు, సర్ప గ్రహ దోష పూజలను వేదపండితులు బ్రహ్మశ్రీ దంటూ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు సీహెచ్.వీఆర్కే.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని ఈనెల 29వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ లోని జై సంతోషి మాత దేవాలయ ప్రాంగణంలో జరుగుతుందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8919648996, 8919416798 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు : సీహెచ్.వీఆర్కే. మూర్తి
RELATED ARTICLES