Saturday, December 21, 2024
Home Blog Page 57

అంబేద్కర్ కు నివాళులర్పించిన ఈదుల పరుశురాం మాదిగ

0

ఎల్బీనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్బీనగర్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ దళిత సంఘాల జేఏసీ చైర్మన్ ఈదుల పరుశురాం మాదిగ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు టి.యాదగిరి, బాలకృష్ణ, నర్సింహ, వేణు, నర్సింహ, వెంకటేష్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆడాల రమేష్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

జీఎస్ ఆర్ కన్వెన్షన్ సెంటర్ ను మంత్రి కేటీఆర్

0

ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన జీఎస్ ఆర్ కన్వెన్షన్ సెంటర్ ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తూ వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గజ్జెల సుష్మ మధుసూదన్ రెడ్డి, నిర్వాహకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ స్పైసీ ఆదిత్యం బిర్యాని హబ్ ప్రారంభం

0

ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ స్పైసీ ఆదిత్యం బిర్యాని హబ్ ను  కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కస్టమర్లకు రుచికరమైన ఆహారం పదార్థాలు అందిస్తూ వారి మన్ననలు పొందాలని అన్నారు. అనంతరం నిర్వాహకులు అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఫిరోజ్ నగర్ సర్పంచ్ జంగయ్య, టిఆర్ఎస్ నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, శంకర్ నాయక్, నిర్వాహకులు శివరాజ్, వరుణ్, మల్లేష్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

ఓయ్ రజినీకాంత్ వెబ్ సిరీస్ టీజర్ ను ఆవిష్కరించిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

0

ఎల్బీనగర్: ఓయ్ రజినీకాంత్ వెబ్ సిరీస్ టీజర్ ను టిఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ నాగరాజు కోక దర్శకుడిగా, నటుడిగా రూపొందించిన ఓయ్ రజినీకాంత్ వెబ్ సిరీస్ ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో నాగరాజు కోక ఆధ్వర్యంలో మరిన్ని వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాలని సూచించారు. అంతకుముందు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పండాల రాజశేఖర్ గౌడ్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మన్నది వెంకటేష్, కుంచం శేఖర్, సాంకేతిక నిపుణులు హరిబాబు, మణికంఠ, రసూల్‌, మహేందర్ గౌడ్, రవి, సహదేవులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

చైనాలో కొనసాగుతున్న కొవిడ్‌ విజృంభణ.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు..!

0

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కనుమరుగవుతున్న తరుణంలో కొవిడ్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వరుసగా ఐదో రోజు చైనాలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి. ఆదివారం ఒక్కరోజే 40,347 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ కమిషనర్‌ వెల్లడించింది. అందులో 3,822 కేసులు వైరస్‌ లక్షణాలతో ఉన్నట్లు తెలిపింది. 36,525 మందికి ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొంది. ఇక చైనాలో 3,11,624 కొవిడ్ కేసులు రికార్డు అయినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు కొత్త క‌రోనా ఇన్ఫెక్షన్ కార‌ణంగా 5,232 మంది చ‌నిపోయారు.

శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ పట్కర్ (ఖత్రి) సమాజ్ ఎల్బీనగర్ విభాగం నూతన కార్యవర్గం ఎన్నిక

0

ఎల్బీనగర్: శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ పట్కర్(ఖత్రి) సమాజ్ ఎల్బీనగర్ విభాగం సభ్యులు అందరూ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కరోనా సమయంలో ఎంతో మంది నిరుపేదలకు ఉచిత అన్నదానం, స్కూల్ పిల్లలకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.అనేకసార్లు మాస్కుల పంపిణీ శానిటైజర్ల పంపిణీ, వితంతువులకు బట్టలు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశామని వివరచారు. ఎందరినో కరోనా సమయంలో అదుకున్నామని అన్నారు. ఫీజులు కట్టలేని వారికి సైతం తమవంతుగా ఆదుకున్నామని అన్నారు. అలాగే భవిషత్తులో కూడా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక వసతిగృహం, ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఇది అందరి కృషితోనే సాధ్యమవుతుందని అన్నారు. ఇది మన అందరిదీ అనే భావన మనలో ఉన్నప్పుడే మనం మన లక్షాన్ని చేరుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎస్పీ స్వామి నారాయణ్ పవార్ మాట్లాడుతూ సమాజంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని, అన్నింటికీ కాకపోయిన కొందరిని అయినా తమవంతుగా సహాయం చేద్దామని ఇంత మంచి సేవా చేసే దృక్పధం ఉన్న వారిని ఇక్కడ కలుసుకున్నామని అన్నారు. తనకు సంతోషంగా ఉందని నారాయణ్ పవార్ కమిటీ సభ్యులను కొనియాడారు. తనవంతు ఏ సహాయ, సహకారాలు కావాల్సినా ముందుంటానని హామీనిచ్చారు. ఇందులో జమన్ జ్యోతి రమేష్,(ప్రెసిడెంట్) వి.మోహన్ కుమార్ జిత్రి (వైస్ ప్రెసిడెంట్), పూజారి సురేందర్(సెక్రెట్రీ), జ్యోతిరాజు(వైస్ ప్రెసిడెంట్), బాధనపల్లి రాజన్న) తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ పట్కర్ (ఖత్రి) సమాజ్ ఎల్బీనగర్ విభాగం నూతన కార్యవర్గం ఎన్నిక

0

ఎల్బీనగర్: శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ పట్కర్ (ఖత్రి )సమాజ్ ఎల్బీనగర్ విభాగం సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎస్పీ స్వామి నారాయణ్ పవార్ హాజరయ్యారు.

సాయిబాబా మందిరం షష్టమ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

0

ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినపురం డివిజన్ శ్రీ వెంకటేశ్వరకాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం షష్టమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, జిట్టా రాజశేఖర్ రెడ్డి, జీవీ.సాగర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ నాయక్, అందోజు సత్యంచారి, ఉదయ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ గోదల రఘుమరెడ్డి, ప్రధాన కార్యదర్శి ధర్మారెడ్డి, కోశాధికారి తిరుపతిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు : సీహెచ్.వీఆర్కే. మూర్తి

0

ఎల్బీనగర్: సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని వనస్థలిపురం భక్త సమాజం, జై సంతోషిమాత దేవాలయం  సంయుక్త  నిర్వహణలో ఆశ్లేష సర్ప శాంతి హోమ పూజ, రాహు-కేతు, సర్ప గ్రహ దోష పూజలను వేదపండితులు బ్రహ్మశ్రీ దంటూ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు సీహెచ్.వీఆర్కే.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని ఈనెల 29వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ లోని జై సంతోషి మాత దేవాలయ ప్రాంగణంలో జరుగుతుందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు  8919648996,  8919416798 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు : సీహెచ్.వీఆర్కే. మూర్తి

0

ఎల్బీనగర్: సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని వనస్థలిపురం భక్త సమాజం, జై సంతోషిమాత దేవాలయం  సంయుక్త  నిర్వహణలో ఆశ్లేష సర్ప శాంతి హోమ పూజ, రాహు-కేతు, సర్ప గ్రహ దోష పూజలను వేదపండితులు బ్రహ్మశ్రీ దంటూ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు సీహెచ్.వీఆర్కే.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని ఈనెల 29వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ లోని జై సంతోషి మాత దేవాలయ ప్రాంగణంలో జరుగుతుందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు  8919648996,  8919416798 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.