ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ స్పైసీ ఆదిత్యం బిర్యాని హబ్ ను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కస్టమర్లకు రుచికరమైన ఆహారం పదార్థాలు అందిస్తూ వారి మన్ననలు పొందాలని అన్నారు. అనంతరం నిర్వాహకులు అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఫిరోజ్ నగర్ సర్పంచ్ జంగయ్య, టిఆర్ఎస్ నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, శంకర్ నాయక్, నిర్వాహకులు శివరాజ్, వరుణ్, మల్లేష్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.