ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినపురం డివిజన్ శ్రీ వెంకటేశ్వరకాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం షష్టమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, జిట్టా రాజశేఖర్ రెడ్డి, జీవీ.సాగర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ నాయక్, అందోజు సత్యంచారి, ఉదయ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ గోదల రఘుమరెడ్డి, ప్రధాన కార్యదర్శి ధర్మారెడ్డి, కోశాధికారి తిరుపతిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
సాయిబాబా మందిరం షష్టమ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
RELATED ARTICLES