Saturday, December 21, 2024
Home Blog Page 56

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చాంబర్‌లోకి ప్రవేశం నిషేధం

0

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ప్రభావం కొంతకాలంగా కనిపించడం లేదు. దాదాపు రెండేళ్లు వినియోగించిన మాస్క్‌లు తొలగి ఇప్పుడిప్పుడే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నాం. కానీ, ఇప్పటికీ జీహెచ్‌ఎంసీలో మాత్రం మాస్క్‌ లేకుంటే నో ఎంట్రీ అనే బోర్డు దర్శనం ఇస్తోంది. ఇది కేవలం బోర్డులు, సూచనలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ నిబంధన ఇప్పటికీ జీహెచ్‌ఎంసీలో కచ్చితంగా అమలవుతోంది. కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ చాంబర్‌లోకి మాస్క్‌ లేకుంటే ఇప్పటికీ ప్రవేశంలేదు. ఈ విషయం తెలియని కొందరు కమిషనర్‌ను కలిసేందుకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో మాస్క్‌లు ఉంచితే బెటర్‌ అని ఆయనను కలిసేందుకు వచ్చిన ఓ పౌరుడు పేర్కొన్నాడు.

ధర్మో రక్షతి రక్షితః షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పోస్టర్ విడుదల

0

ఎల్బీనగర్ విశ్వ హిందూ పరిషత్, పినాకిని మీడియా ఆధ్వర్యంలో ధర్మో రక్షతి రక్షితః షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పోస్టర్ ను నిర్వహించారు. ఈ పోస్టర్ ను విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కళ్లెం రాజేందర్ రెడ్డి, సహ కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా సంఘటన మంత్రి సాయిరాం, భజరంగదళ్ సభ్యులు సాయి నాథ్, బడంగ్ పేట్ ప్రఖండ అధ్యక్షులు సంజయ్ శర్మ, విద్యార్థి ప్రముఖ్ శ్రీకర్ వేముల, పినాకిని మీడియా అధినేత వంశీశాస్త్రి, ప్రణీత్, పినాకిని మీడియా టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

విలేకరులు కావలెను Wanted Reporter

0

గత తొమ్మిదేళ్లుగా పత్రికా రంగంలో సంచలనాత్మకమైన వార్తా కథనాలతో, నూతన ఒరవడితో ముందుకు దూసుకెళ్తున్న గ్రేట్ తెలంగాణ పత్రిక ఇప్పుడు మరిన్ని తాజా వార్తలు అందించే సదుద్దేశంతో నూతన వెబ్ సైటును ప్రారంభించింది. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేయడమే గ్రేట్ తెలంగాణ పత్రిక ఉద్దేశం. గత తొమ్మిదేళ్లుగా పత్రికా రంగంలో ఉన్న గ్రేట్ తెలంగాణ పత్రికకు, వెబ్ సైట్లలో పనిచేయుటకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఇంచార్జీలు, నియోజకవర్గాల ఇంచార్జీలు, మండలాలు, డివిజన్ల వారీగా రిపోర్టర్లు కావలెను. ప్రజా సమస్యలపై అవగాహన, తెలుగు భాషపై పట్టు ఉన్న యువతీ యువకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. అనుభవం ఉన్న వారికి తొలి ప్రాధాన్యత. మరిన్ని వివరాలకు సంప్రదించండి.

సి.దస్తయ్య
ఎడిటర్ & పబ్లిషర్
గ్రేట్ తెలంగాణ
సెల్ : 98859 29519
Email: greattelangana999@gmail.com

సీఐ పవన్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గంట శ్రవణ్ కుమార్

0

ఎల్బీనగర్: జేంద్రనగర్ పోలీసు స్టేషన్ లో క్రైం ఇన్‌స్పెక్టర్ గ్యార పవన్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపారు. క్రైం ఇన్‌స్పెక్టర్ గ్యార పవన్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంట శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాన్ని అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి, నాయకులు ప్రసాద్, మహమ్మద్ జకీర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

వనస్థలిపురంలో ఆర్ట్ కేఫ్ ను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

0

ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ కేఫ్ ను పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తూ వారి మన్ననలను పొందాలని సూచించారు. అనంతరం మంత్రి తదితరులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్, సామ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి మల్ రెడ్డి రాంరెడ్డి, ఆర్ట్ కేఫ్ నిర్వాహకులు అభిలాష్ రెడ్డి , సమత, దీప్ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ కు నివాళులర్పించిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

0

ఎల్బీనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ హస్తినాపురం డివిజన్ నాయకులు పండాల రాజశేఖర్ గౌడ్, డి.రాజు, ఎం.నగేష్, వై.కుమార్, గడ్డం వెంకటేష్, వై.సురేష్, బి.నర్సింహ, డి.శివలింగం, వై.శ్రీనివాస్, ప్రవీణ్, సతీష్, ధన్ రాజ్, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ కు నివాళులర్పించిన గుంటి లక్ష్మణ్

0

ఎల్బీనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్బీనగర్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎల్బీనగర్ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం చైర్మన్ గుంటి లక్ష్మణ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఆడాల రమేష్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ కు నివాళులర్పించిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి

0

ఎల్బీనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్బీనగర్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రల గురించి విద్యార్థులకు బోధించాలని సూచించారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు ఆడాల రమేష్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ కు నివాళులర్పించిన మంత్రి కేటీఆర్

0

ఎల్బీనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్బీనగర్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ‌ కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, టిఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆడాల రమేష్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ కు నివాళులర్పించిన రాజ్ కుమార్

0

ఎల్బీనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చైర్మన్ రాజ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.