ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ కేఫ్ ను పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తూ వారి మన్ననలను పొందాలని సూచించారు. అనంతరం మంత్రి తదితరులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్, సామ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి మల్ రెడ్డి రాంరెడ్డి, ఆర్ట్ కేఫ్ నిర్వాహకులు అభిలాష్ రెడ్డి , సమత, దీప్ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వనస్థలిపురంలో ఆర్ట్ కేఫ్ ను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
RELATED ARTICLES