ఎల్బీనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ హస్తినాపురం డివిజన్ నాయకులు పండాల రాజశేఖర్ గౌడ్, డి.రాజు, ఎం.నగేష్, వై.కుమార్, గడ్డం వెంకటేష్, వై.సురేష్, బి.నర్సింహ, డి.శివలింగం, వై.శ్రీనివాస్, ప్రవీణ్, సతీష్, ధన్ రాజ్, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కు నివాళులర్పించిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్
RELATED ARTICLES