ఎల్బీనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్బీనగర్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, టిఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆడాల రమేష్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.