ఎల్బీనగర్ విశ్వ హిందూ పరిషత్, పినాకిని మీడియా ఆధ్వర్యంలో ధర్మో రక్షతి రక్షితః షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పోస్టర్ ను నిర్వహించారు. ఈ పోస్టర్ ను విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కళ్లెం రాజేందర్ రెడ్డి, సహ కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా సంఘటన మంత్రి సాయిరాం, భజరంగదళ్ సభ్యులు సాయి నాథ్, బడంగ్ పేట్ ప్రఖండ అధ్యక్షులు సంజయ్ శర్మ, విద్యార్థి ప్రముఖ్ శ్రీకర్ వేముల, పినాకిని మీడియా అధినేత వంశీశాస్త్రి, ప్రణీత్, పినాకిని మీడియా టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
ధర్మో రక్షతి రక్షితః షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పోస్టర్ విడుదల
RELATED ARTICLES