హైదరాబాద్: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ప్రభావం కొంతకాలంగా కనిపించడం లేదు. దాదాపు రెండేళ్లు వినియోగించిన మాస్క్‌లు తొలగి ఇప్పుడిప్పుడే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నాం. కానీ, ఇప్పటికీ జీహెచ్‌ఎంసీలో మాత్రం మాస్క్ లేకుంటే నో ఎంట్రీ అనే బోర్డు దర్శనం ఇస్తోంది. ఇది కేవలం బోర్డులు, సూచనలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ నిబంధన ఇప్పటికీ జీహెచ్‌ఎంసీలో కచ్చితంగా అమలవుతోంది. కమిషనర్ డీఎస్ లోకే్‌షకుమార్ చాంబర్‌లోకి మాస్క్ లేకుంటే ఇప్పటికీ ప్రవేశంలేదు. ఈ విషయం తెలియని కొందరు కమిషనర్‌ను కలిసేందుకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో మాస్క్‌లు ఉంచితే బెటర్ అని ఆయనను కలిసేందుకు వచ్చిన ఓ పౌరుడు పేర్కొన్నాడు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ చాంబర్‌లోకి ప్రవేశం నిషేధం
RELATED ARTICLES