హైదరాబాద్: క్షయ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహించారు. జిహెచ్ఎంసి పరిధిలోని బాలానగర్ వైద్య సిబ్బంది మూసాపేట్ జనతా నగర్ లో ఇంటింటికి తిరుగుతూ క్షయ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. జేడీ డాక్టర్ రాజేశం సిబ్బంది పనితీరును పరిశీలించి రోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు క్షయ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. క్షయ వ్యాధి సోకిన రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి సూచనలు చేసినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మోహన్, రామకృష్ణ, వాలంటీర్లు పాల్గొన్నారు.
దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది : బుడ్డ సత్యనారాయణ
కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే సహించేదిలేదు
మన్సూరాబాద్ డివిజన్ లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎల్బీనగర్: రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పరిచింది కాంగ్రెస్ పార్టీనని కాంగ్రెస్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండాను డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉందని, కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీని నిందించడం ప్రతిపక్షాలకు తగదని హితవు పలికారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు చందులాల్, నాయకులు సుధాకర్ గౌడ్, కళ్లెం నరసింహారెడ్డి, బండ శ్యామ్ రెడ్డి, పృధ్విరాజ్, జెల్ల లాలయ్య గౌడ్, సతీష్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి అనంతుల నాగయ్య గౌడ్, వెంకటేష్ యాదవ్, విఠల్ రెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
మిషన్ భగిరథ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొట్టుకుపోయిన రైతు రెక్కల కష్టం
* ట్యాంకు ఓవర్ ఫుల్ తో రైతు కంట కన్నీరు మిగిల్చింది
గార్ల: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధికారుల అలసత్వం కారణంగా ప్రజలకు నీటి సమస్య తొలగించాల్సిందిపోయి రైతులకు ఇబ్బందులు తెస్తున్నారు. ప్రజల సమస్యలను తీర్చడానికి తలపెట్టిన పథకం కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది. వర్షాల కారణంగా వరదలు వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం రైతు పరిస్థితి అలా తయారయింది. ఎండనకా.. వాననకా ఆరుగాలం కష్టపడి పండించిన కౌలు రైతు రెక్కల కష్టం మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నోటికాడికి వచ్చిన పంట కొట్టుకపోయిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. గార్ల మండల కేంద్రంలోని కౌలు రైతు తోడేటి శ్రీనివాస్ మండల కేంద్రంలో ఆరు ఎకరాలు పొలం కౌలుకు చేసి ఇటీవల హార్వెస్టర్ తో కోయించిన పంటను అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కెట్ కు తరలించి వడ్లను అరబోశారు శాతం రావడంతో మంగళవారం ఆరబోసిన వడ్లను దగ్గరకు చేసి బుధవారం ఉదయం తమ వడ్లను కాంట వేయిద్దామని వడ్ల రాశి వద్దకు వచ్చి చూస్తే వడ్లు మొత్తం కొట్టుకపోయిన ఉన్న సంఘటనను చూసి రైతు శ్రీనివాస్ లబోదిబోమంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా రైతు శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ పక్కనే ఉన్న మిషన్ భగీరథ ట్యాంకుల ఓవర్ ఫుల్ నీటి కారణంగా తమ వడ్ల రాసి మొత్తం కొట్టుకుపోయిందని, సుమారుగా నాలుగు పుట్ల వడ్లు కొట్టకపోవడం పట్ల దాదాపు 30 నుండి 40 వేల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారుల పర్యవేక్షణాలోపం మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా ట్యాంకుల ఓవర్ ఫుల్ తో ఉబ్బెత్తున నీరు రావడంతో తమ పంట కొట్టుకపోయిందని అప్పులు చేసి మరి పెట్టుబడులు పెట్టి రెక్కలను ముక్కలుగా చేసుకొని ఆరుగాలం కష్టపడి పండించి చివరకు చేతికొచ్చిన పంట ఇలా నీటి పాలు అవుతూ కొట్టుకుపోయినా ఇంతవరకు అధికారులు స్పందించలేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తమకు పంట నష్టపరిహారం చెల్లించాలని లేనియెడల కుటుంబంతో సహా ఆత్మహత్యే మాకు శరణ్యమన్నారు.
TUWJ- H143 జిల్లా మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్: జర్నలిస్టల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఈనెల 30వ తేదీన ఇబ్రహీంపట్నం కొంగరకలాన్ లో జరిగే టీయుడబ్లూజే-143 రంగారెడ్డి జిల్లా మహాసభల పోస్టర్ ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈనెల 30వ తేదీన జరిగే జిల్లా మహాసభలకు హాజరు కావాలని కోరుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం కమిటీ ఎమ్మెల్యే ను కోరారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్లూజే-143 రాష్ట్ర నాయకులు ఉప్పు సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం రమేష్, ఉపాధ్యక్షులు తగరం సత్యనారాయణ, సతీష్ యాదవ్, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు చిత్రం సైదులు, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి నాగరాజు, టెంజు అధ్యక్షులు బొంగు భరత్ గౌడ్, కార్యదర్శి సురేష్, నాయకులు గిరిగౌడ్, రవికుమార్, లింగస్వామి, అనిల్, ఆనంద్, శంకర్, శ్రీనివాస్, సాయిరాం, కరణ్, అజయ్, ధర్మనాయక్, రాఘవేందర్, శ్రీరామ్, సురేందర్, భరత్, వెంకట్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
TUWJ-H143 రంగారెడ్డి జిల్లా మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్: జర్నలిస్టల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఈనెల 30వ తేదీన ఇబ్రహీంపట్నం కొంగరకలాన్ లో జరిగే టీయుడబ్లూజే-143 రంగారెడ్డి జిల్లా మహాసభల పోస్టర్ ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈనెల 30వ తేదీన జరిగే జిల్లా మహాసభలకు హాజరు కావాలని కోరుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం కమిటీ ఎమ్మెల్యే ను కోరారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్లూజే-143 రాష్ట్ర నాయకులు ఉప్పు సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం రమేష్, ఉపాధ్యక్షులు తగరం సత్యనారాయణ, సతీష్ యాదవ్, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు చిత్రం సైదులు, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి నాగరాజు, టెంజు అధ్యక్షులు బొంగు భరత్ గౌడ్, కార్యదర్శి సురేష్, నాయకులు గిరిగౌడ్, రవికుమార్, లింగస్వామి, అనిల్, ఆనంద్, శంకర్, శ్రీనివాస్, సాయిరాం, కరణ్, అజయ్, ధర్మనాయక్, రాఘవేందర్, శ్రీరామ్, సురేందర్, భరత్, వెంకట్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు సేవలు అభినందనీయం: కార్పొరేటర్ శ్రీవాణి అంజన్
ఎల్బీనగర్: సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు చేస్తున్న కృషి అభినందనీయమని సరూర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అన్నారు. సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ లో శుక్రవారం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ శ్రీవాణి అంజన్ హాజరై అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చేందుకు అన్నదానాలు చేయడం హర్షణీయమని అన్నారు. ఎవరు ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రతిఒక్కరూ తోడుగా నిలవాలని సూచించారు. సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు చేస్తున్న కృషికి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. అనంతరం కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ తదితరులను శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు జమజ్యోతి రమేష్, ఉపాధ్యక్షులు వి.మోహన్, కార్యదర్శి పూజారి సురేందర్, సంయుక్త కార్యదర్శి జ్యోతి రాజు, కోశాధికారి బి.రాజన్న, సభ్యులు పాల్గొన్నారు.
నిత్యం వేలాది మంది ఆకలి తీర్చుతున్న పుల్లూరి ఉపేందర్ గుప్త సేవలు అభినందనీయం: డాక్టర్ భార్గవ గురుస్వామి
ఎల్బీనగర్: ప్రతినిత్యం వందలాది మంది ఆకలిని తీర్చుతూ వారికి నేనున్నానంటూ పుల్లూరి అనంతలక్ష్మీ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని డాక్టర్ భార్గవ గురుస్వామి కొనియాడారు. అయ్యప్పస్వామి మాలధారణ చేసిన స్వాములకు మండల కాలం పాటు పుల్లూరి అనంతలక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ పుల్లూరి ఉపేందర్ గుప్త ఆధ్వర్యంలో చంపాపేటలో నిత్య అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. 41 రోజులపాటు వందలాదిమంది స్వాములకు అల్పాహారాన్ని పెడుతూ సేవారంగంలో ముందుకు దూసుకెళ్తున్నారు. నిత్య అల్పాహారం ముగింపు సందర్భంగా స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భార్గవ గురుస్వామి మాట్లాడుతూ అనంతలక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ పుల్లూరి ఉపేందర్ గుప్త ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, చిలుకూరి బాలాజీ టెంపుల్ తదితర ప్రాంతాల్లో 365 రోజులపాటు వేలాదిమంది ఆకలిని తీర్చుతూ వారికి నేనున్నానని భరోసా కల్పించడం హర్షణీయమని అన్నారు. పుల్లూరి ఉపేందర్ గుప్త ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వమున్న వ్యక్తి అని ప్రశంసించారు. పుల్లూరి ఉపేందర్ గుప్త చేస్తున్న సేవా కార్యక్రమాలకు దాతలు సహకరిస్తే మరిన్ని సేవలు చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం నిత్య అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన పుల్లూరి ఉపేందర్ గుప్త, తదితరులను అయ్యప్ప స్వాములు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేణుకాంత్, సత్యనారాయణ, గిరి, శివానంద్, నాగరాజు, బాలరాజు, శ్రీధర్ రెడ్డి, అశుతోష్, యాదగిరి, రాజు, స్వాములు గోపాల్ యాదవ్, మాల్యాద్రి, రవి, శ్రీకాంత్, శ్యాంసుందర్, పవన్, అశోక్, ప్రతాప్, వెంకటరెడ్డి, అధిక సంఖ్యలో స్వాములు పాల్గొన్నారు.
శరీర దారుఢ్యానికి క్రీడలు దోహదం: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్: డీఎస్ ఆర్ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్ టోర్నమెంట్ ను తట్టిఅన్నారంలో నిర్వహించారు. రెండు నెలల పాటు నిర్వహించిన టోర్నమెంట్ లో బుధవారం ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. యువకుల్లో పోటీతత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు, క్రీడాకారులకు ట్రోఫీలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నిర్వాహకులు చంద్రశేఖర్ రెడ్డి, క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవీ సాగర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తూర్పాటి చిరంజీవి, పాండ్యన్, సాజిద్, హుస్సేన్, నవీన్, ఇమ్రాన్, బలరాం, కటికరెడ్డి అరవింద్ రెడ్డి, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన దర్పల్లి రాజశేఖరరెడ్డి
ఎల్బీనగర్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీసుల దాడికి నిరసనగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా దర్పల్లి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేసి రికార్డులను, హార్డుడిస్క్ లను సీజ్ చేయడం, ఎలాంటి ఎఫ్. వారెంట్ లేకుండా అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారపు శ్రీనివాసరావు, నాయకులు పల్స శ్రీధర్ గౌడ్, రమేష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, సునీల్ గౌడ్, శ్రీకాంత్, రంజిత్, మంజులారెడ్డి, సౌమ్య, కవిత, కరణ్, శివ, విష్ణు, గౌస్, భానుచందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భిక్షపతి నాయక్ కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయం చేసిన చిలుక ఉపేందర్ రెడ్డి
ఎల్బీనగర్: పేద కుటుంబాలను ఆదుకునేందుక తమవంతు కృషి చేస్తున్నామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు భిక్షపతి నాయక్ ఇటీవల మరణించారు. విషయాన్ని తెలుసుకున్న చిలుక ఉపేందర్ రెడ్డి భిక్షపతి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిలుక ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలకు చేయూతనిచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భిక్షపతి నాయక్ భార్య మంగిబాయి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.