ఎల్బీనగర్: ప్రతినిత్యం వందలాది మంది ఆకలిని తీర్చుతూ వారికి నేనున్నానంటూ పుల్లూరి అనంతలక్ష్మీ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని డాక్టర్ భార్గవ గురుస్వామి కొనియాడారు. అయ్యప్పస్వామి మాలధారణ చేసిన స్వాములకు మండల కాలం పాటు పుల్లూరి అనంతలక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ పుల్లూరి ఉపేందర్ గుప్త ఆధ్వర్యంలో చంపాపేటలో నిత్య అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. 41 రోజులపాటు వందలాదిమంది స్వాములకు అల్పాహారాన్ని పెడుతూ సేవారంగంలో ముందుకు దూసుకెళ్తున్నారు. నిత్య అల్పాహారం ముగింపు సందర్భంగా స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భార్గవ గురుస్వామి మాట్లాడుతూ అనంతలక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ పుల్లూరి ఉపేందర్ గుప్త ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, చిలుకూరి బాలాజీ టెంపుల్ తదితర ప్రాంతాల్లో 365 రోజులపాటు వేలాదిమంది ఆకలిని తీర్చుతూ వారికి నేనున్నానని భరోసా కల్పించడం హర్షణీయమని అన్నారు. పుల్లూరి ఉపేందర్ గుప్త ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వమున్న వ్యక్తి అని ప్రశంసించారు. పుల్లూరి ఉపేందర్ గుప్త చేస్తున్న సేవా కార్యక్రమాలకు దాతలు సహకరిస్తే మరిన్ని సేవలు చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం నిత్య అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన పుల్లూరి ఉపేందర్ గుప్త, తదితరులను అయ్యప్ప స్వాములు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేణుకాంత్, సత్యనారాయణ, గిరి, శివానంద్, నాగరాజు, బాలరాజు, శ్రీధర్ రెడ్డి, అశుతోష్, యాదగిరి, రాజు, స్వాములు గోపాల్ యాదవ్, మాల్యాద్రి, రవి, శ్రీకాంత్, శ్యాంసుందర్, పవన్, అశోక్, ప్రతాప్, వెంకటరెడ్డి, అధిక సంఖ్యలో స్వాములు పాల్గొన్నారు.
నిత్యం వేలాది మంది ఆకలి తీర్చుతున్న పుల్లూరి ఉపేందర్ గుప్త సేవలు అభినందనీయం: డాక్టర్ భార్గవ గురుస్వామి
RELATED ARTICLES