ఎల్బీనగర్: శ్రీ మహాశాస్త్రా సన్నిధి సేవా సమాజం వ్యవస్థాపకులు డాక్టర్ భార్గవ గురుస్వామి ఆధ్వర్యంలో రూపొందించిన స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సర తెలుగు కాలానుక్రమణిక 2023-2024వ సంవత్సర పంచాంగ శ్రవణ పుస్తకాన్ని గురువారం ఎల్బీనగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో భార్గవ గురుస్వామి లాంఛనంగా ఆవిష్కరించారు. పంచాంగ పుస్తక ఆవిష్కరణలో నిమ్మలూరి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రమావత్ రవినాయక్, శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పద్మ కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకెపూడి గాంధీ పాపిరెడ్డినగర్ లో నివసిస్తున్న చిటికెల వేణుగోపాల్ రెడ్డి తల్లి చిటికెల పద్మ ఇటీవల మరణించారు. గురువారం పద్మ దశదినకర్మ జరిగింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చిటికెల పద్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పద్మ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పద్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నివాళులు అర్పించిన వారిలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు రాజు యాదవ్, చింతగింజల రవీందర్, కొండల్ రెడ్డి, రాంబాబు, లింగారెడ్డి, రమేష్ తదితరులు ఉన్నారు.
విద్యా మందిర్ హైస్కూల్ విద్యార్థులకు శానిటేషన్ టీం ఆధ్వర్యంలో అవగాహన
శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ లో పరిసరాల పరిశుభ్రత పరిరక్షించండి, చెత్త పారవేయడానికి స్వచ్చ ఆటోలని ఉపయోగించండంటూ అవగాహన కార్యక్రమాలలో భాగంగా శ్రీ విద్యా మందిర్ హైస్కూల్ విద్యార్థులకు జిహెచ్ఎంసి శానిటేషన్ బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత పాటించటానికి అందరూ సహకరించాలని, పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యదాయకమని, పరిశుభ్రతలో భాగంగా పొడి, తడి, చెత్తలను బహిరంగంగా పడవేయకుండా తడి, పొడి చెత్తలను పారవేసే క్రమంలో స్వచ్ఛ ఆటోలనే ఉపయోగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇంచార్జి సరహాజ్ అలీ , డబ్ల్యూ.ఎఫ్ ఏ. అరుణ, జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సివిల్ టెక్స్ లాబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
సివిల్ టెక్స్ లాబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకల
మేడ్చల్ మల్కాజిగిరి
మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి:సివిల్ టెక్ లాబ్స్ సీఈఓ పద్మా వెంగల
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని సివిల్ టెక్స్ లాబ్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ టెక్ లాబ్స్ సీఈఓ పద్మా వెంగాల మాట్లాడుతూ
‘కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభా’ అని కవి చెప్పినట్టుగా ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు.ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉంటుందనేది అక్షర సత్యం.
స్త్రీ లేకపోతే జననం లేదు..
స్త్రీ లేకపోతే గమనం లేదు..
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవితం లేదు..
ఒక స్త్రీ తల్లిలా లాలిస్తుంది,చెల్లిగా తోడుంటుంది, భార్యగా బాధ్యతగా భర్త బాగోగులు చూస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తూ స్వరం త్యాగం చేస్తుంది. అయినప్పటికీ స్త్రీలను సమాజంలో మగవారు సమానంగా చూడడం లేదు. సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా మహిళల పట్ల మగవారి ఆలోచన ధోరణి మాత్రం మారడం లేదని అన్నారు. వీటన్నిటిని తట్టుకొని నేడు ప్రపంచంలో మహిళలు తిరుగులేని శక్తిగా నిలుస్తున్నారని, ప్రతీ మగాడి విజయం వెనుక మహిల ఉందని ఆ విషయాన్ని ప్రపంచం మొత్తం నేడు గుర్తిస్తుందని అన్నారు. ఈ మహిళా దినోత్సవం కోసం మహిళల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయని వాటి ఫలితమే నేడు మార్చి 8ని ప్రపంచ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని అన్నారు. నేటితో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 111 వసంతాలు పూర్తి చేసుకున్నాయి అన్నారు. ప్రతి మహిళ పిల్లలకు జన్మనిచ్చినప్పుడు వారిని చూస్తూ నా కొడుకు ఒక ఐపీఎస్, ఇంజనీరు, డాక్టర్ కావాలని కోరుకుంటారని అదే ఆడబిడ్డ పుడితే కలెక్టర్, లాయర్, డాక్టర్ ఇలా అనేక రంగాల్లో రాణించాలని కలలు కంటారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత విద్య కోసం త్యాగాలు చేస్తూ విదేశాలకు పంపిస్తున్నారని ఆ విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకొని తల్లిదండ్రుల ఆశలను, కలలను నిలబెట్టాలని కోరారు . ఆడది అంటే అబల కాదు సభల అని నిరూపించాలని, ఎంతటి కష్టం వచ్చినా అత్యంత ధైర్యంతో అదురు,బెదురు లేకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలో వివిధ రంగాలలో గణనీయమైన కృషి చేసి శాశ్వత ప్రభావాన్ని చూపిన మహిళల గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది.
మహోన్నతమైన,ఆదర్శవంతమైన మహిళలకు మనదేశంలో కొదవలేదు. ముఖ్యంగా భారతదేశపు తొలి ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ , చరిత్రలో రాజ్యాల్ని ఏలిన రాణి రుద్రమదేవి, భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మహిళా కల్పనా చావ్లా లాంటి వారు చాలామంది ఉన్నారు.
ఆడది అంటే అబల కాదు సబల అని పురాణ ఇతిహాసాలోనే ఉంది ప్రస్తుత ప్రపంచంలోను మన మహిళలు తమ శక్తిని చాటుతున్నారు.
స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్న ఈ ఘన స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంలో మహిళా బిల్లును ఆమోదింప చేసుకోకపోవడం దురదృష్టకరమైన విషయం.
1990 నుండి పెండింగ్లో ఉన్న మహిళా బిల్లు కోసం మహిళా లోకం ఎదురుచూస్తుంది.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ చట్టం అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రతీ మహిళ తన హక్కులను బాధ్యతలు తెలుసుకొని, తనకున్న శక్తి,యుక్తులను సమగ్రంగా ఆవిష్కరించుకొని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ధైర్యాన్ని,సామర్థ్యాన్ని,స్వేచ్ఛను కలిగి ఉండటం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సహాయం తీసుకోకుండా స్వతంత్రంగా ఉండటమే మహిళా సాధికారత.
గత 05 సంవత్సరాలుగా మా సివిల్ టెక్లాబ్స్ ద్వారా అనేక సాంఘిక కార్యక్రమాలు యువతను ఉపాధి కార్యక్రమాలు, అనాదలకు బియ్యం పంపిణీ చలి కాలం లో దుప్పట్లు పంపిణీ లాంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని,ఎంతో మంది ప్రజలకు సేవలు చేశామని తెలిపారు. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా సివిల్ టెచ్ లాబ్స్ పరిధిలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎంతో మంది మహిళలు వారి స్వశక్తితో వివిధ రంగాల్లో పురుషులకు సమానంగా రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆస్పూర్తిని అభద్రతాభావం కలిగిన మహిళల్లో ఆత్మస్థైర్యం నింపుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు
సుపీరియర్ లాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ గారు మాట్లాడుతూ
ఎత్రనారేస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత
అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని దాని అర్థం.
స్త్రీని దేవతగా పూజించకపోయినా పరవాలేదు కానీ స్త్రీ కూడా పురుషునితో సమానం అనే నిజాన్ని గ్రహిస్తే చాలు.
కానీ నేడు అలా జరగటం లేదు. అయినా మొక్కువోని దీక్షతో సమాజంలో కొందరు మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిగమిస్తూ శ్రీ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఏ రంగంలోనూ పురుషులకు తీసిబోమని ప్రతిక్షణం నిరూపిస్తూనే ఉన్నారు. విద్య,వైద్యం,వ్యాపార,రాజకీయం, క్రీడలు,నటన, టెక్నాలజీ ,బ్యాంకింగ్ హెల్త్ కేర్ అంతరిక్షంలో ఇలా ప్రతి రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేస్తూ రాణిస్తు మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మన దేశంలో ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురి అవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. ఇందుకు కారణాలలేమిటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ టెక్ లాబ్స్ యాజమాన్యం మరియు సిబ్బంది మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణాభ్యుదయా పరిషత్ నూతన కార్యవర్గం ఎన్నిక
సరూర్‌నగర్: బ్రాహ్మణాభ్యుదయా పరిషత్ నూతన కార్యవర్గం ఎన్నికయ్యింది. గొట్టిముక్కుల నరసింహశర్మ అధ్యక్షతన సోమవారం సాయంత్రం సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అధ్యక్షులుగా డేరం భాస్కర్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా చింతలపల్లి మధుబాబు శర్మ, ట్రెజరర్ గా డేరం గోపికృష్ణ శర్మ,ప్రచార కార్యదర్శిగా ఎల్లికంటి వంశికృష్ణశాస్త్రి లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డేరం రాము, కుర్మెటి రాము, పాల నరేంద్ర, సీహెచ్.నరేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కాంగ్రెస్ నేత చిక్కుళ్ల శివప్రసాద్ జన్మదిన వేడుకలు
ఎల్బీనగర్: కాంగ్రెస్ పార్టీ సరూర్‌నగర్ డివిజన్ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుడు చిక్కుళ్ల శివప్రసాద్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిక్కుళ్ల శివప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి తదితరులు చిక్కుళ్ల శివప్రసాద్ ను శాలువాతో, పూల బొకేలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిక్కుళ్ల శివప్రసాద్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్, సరూర్‌నగర్ డివిజన్లకు చెందిన వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చి తనకు శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటాలు చేసిన తాను కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం లభించడం సంతోషంగా ఉందనన్నారు. రాబోయే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పున్న గణేష్ నేత, బండి మధుసూదన్ రావు నల్లంకి ధనరాజ్ గౌడ్, గంగం కిషోర్ కుమార్, హైటెక్ రాము, ఇమ్రాన్ అలీ, భాస్కర్, గుల్షన్, సన్నీ, హరీష్, ప్రవీణ్, సిద్దు, మురళి, శివ, ప్రవీణ్ యాదవ్, కిట్టు, వినోద్, వెంకట్, దయాకర్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
చేర్యాలలో ఘనంగా స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు
చేర్యాల: స్వామి వివేకానంద జయంతోత్సవాలు చేర్యాలలో ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా చేర్యాలలో స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు చేపట్టారు. స్వామి వివేకనందుడికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేడ్చల్ రూరల్ ఓబిసి మొర్చా వైస్ ప్రెసిడెంట్ భీమగాని విజయ్ కుమార్ మాట్లాడుతూ వివేకానందుడిని యువతీ యువకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భావితరం అంతా యువత మీదే ఉందని, సమయం పోతే తిరిగి రాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు కేబుల్ రవి, జిల్లా కార్యవర్గసభ్యులు మధుసూదన్, రాము, నాగరాజు, ఓంప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
TUWJ H-143 రాష్ట్ర మహాసభలకు బయలుదేరిన జర్నలిస్టులు
ఎల్బీనగర్: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్-143, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పటాన్ చెరులో జరుగుతున్న 10వ ప్లీనరి మహాసభలకు ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి జర్నలిస్టులు బయలుదేరి వెళ్లారు. పటాన్ చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న మహాసభల సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో జర్నలిస్టులు కొత్తపేట బాబు జగ్జీవన్ రామ్ భవన్ నుండి బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఉప్పు సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు తగరం సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి పల్లె వెంకన్న, టెంజు జిల్లా కార్యదర్శి సతీష్ యాదవ్, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు చిత్రం సైదులు, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి నాగరాజు, ఉపాధ్యక్షులు లింగస్వామి, కార్యవర్గ సభ్యులు సీహెచ్.రవికుమార్, జర్నలిస్టులు యువరాజు, సైదులు, రామ్మోహన్, శ్రవణ్, అజయ్, అశ్వక్, రవి, జర్నలిస్టులు పాల్గొన్నారు.
స్వచ్ఛ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి : గోపాల్ నాయక్
డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తాం: దర్పల్లి రాజశేఖరరెడ్డి
ఎల్బీనగర్: స్వచ్ఛ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని స్వచ్ఛ ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకుడు కేతావత్ గోపాల్ నాయక్ అన్నారు. జిహెచ్ఎంసిలో చెత్తను తరలించే కాంట్రాక్టును రాంకీ సంస్థకు అప్పగించడంతో స్వచ్ఛ ఆటోలు నడుపుతున్న కార్మికులను దశలవారీగా తొలగించడానికి నిరసిస్తూ స్వచ్ఛ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో సరూర్ నగర్ లోని ఎల్బీనగర్ జిహెచ్ఎంసి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా గోపాల్ నాయక్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలో చెత్తను తరలించే బాధ్యతను రాంకీ సంస్థకు అప్పగించడంతో సదరు సంస్థ ప్రస్తుతం చెత్తను తరలిస్తున్న స్వచ్ఛ ఆటో డ్రైవర్లను తొలగిస్తుందని ఆరోపించారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కరోనాను సైతం లెక్కచేయకుండా కార్మికులు తమ ప్రాణాలకు తెగించి వీధులను శుభ్రం చేస్తూ చెత్తని తరలించారని ఆయన గుర్తు చేశారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజులేని పోరాటం చేస్తామని ఆయన హామీనిచ్చారు. స్వచ్ఛ డ్రైవర్ల నిరసన విషయాన్ని తెలుసుకున్న సరూర్‌నగర్ ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్ల నిరసన విషయాన్ని తెలుసుకున్న జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి, కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. అధికారులు, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి హామీతో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు నిరసనను విరమించారు. కార్యక్రమంలో కార్మికులు జగపతిరాజు, యాదయ్య, మౌలాలి, ప్రభాకర్, గణపతి, సోమయ్య, చంద్రనాయక్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
రాము మొగిలోజి, సుమన్ గౌడ్, రవళికి అవార్డుల ప్రధానం
హైదరాబాద్: కళావేదిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన కళావేదిక మాసపత్రికను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రధానం చేశారు. ఇందులో భాగంగా యూట్యూబ్ రంగంలో 1000కి పైగా షార్ట్ ఫిల్మ్స్ ను నిర్మించి ఔరా.. అనిపించే విధంగా ప్రేక్షకులను అలరిస్తున్న షార్ట్ ఫిలిమ్స్ దర్శకులు రాము మొగిలోజికి బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందజేశారు. విధంగా 2000 షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన సుమన్ గౌడ్ కు, నటి రవళిలకు బెస్ట్ యాక్టర్స్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అవార్డులను అందుకున్న దర్శకులు రాము మొగిలోజి, నటీనటులు సుమన్ గౌడ్, రవళి మాట్లాడుతూ గ్రామీణ యాస, భాషలో షార్ట్ ఫిల్మ్స్ ను నిర్మిస్తూ, కోట్లాదిమంది ప్రజలను అలరించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు. తమ ప్రతిభను గుర్తించి కళావేదిక సంస్థ తమకు అవార్డులను ప్రధానం చేయడం హర్షనీయమని అన్నారు. అవార్డులను తీసుకున్న దర్శకులు రాము మొగిలోజి, సుమన్ గౌడ్ రవళిలను పలువురు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.