సివిల్ టెక్స్ లాబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకల
మేడ్చల్ మల్కాజిగిరి
మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి:సివిల్ టెక్ లాబ్స్ సీఈఓ పద్మా వెంగల
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని సివిల్ టెక్స్ లాబ్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ టెక్ లాబ్స్ సీఈఓ పద్మా వెంగాల మాట్లాడుతూ
‘కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభా’ అని కవి చెప్పినట్టుగా ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు.ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉంటుందనేది అక్షర సత్యం.
స్త్రీ లేకపోతే జననం లేదు..
స్త్రీ లేకపోతే గమనం లేదు..
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవితం లేదు..
ఒక స్త్రీ తల్లిలా లాలిస్తుంది,చెల్లిగా తోడుంటుంది, భార్యగా బాధ్యతగా భర్త బాగోగులు చూస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తూ స్వరం త్యాగం చేస్తుంది. అయినప్పటికీ స్త్రీలను సమాజంలో మగవారు సమానంగా చూడడం లేదు. సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా మహిళల పట్ల మగవారి ఆలోచన ధోరణి మాత్రం మారడం లేదని అన్నారు. వీటన్నిటిని తట్టుకొని నేడు ప్రపంచంలో మహిళలు తిరుగులేని శక్తిగా నిలుస్తున్నారని, ప్రతీ మగాడి విజయం వెనుక మహిల ఉందని ఆ విషయాన్ని ప్రపంచం మొత్తం నేడు గుర్తిస్తుందని అన్నారు. ఈ మహిళా దినోత్సవం కోసం మహిళల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయని వాటి ఫలితమే నేడు మార్చి 8ని ప్రపంచ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని అన్నారు. నేటితో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 111 వసంతాలు పూర్తి చేసుకున్నాయి అన్నారు. ప్రతి మహిళ పిల్లలకు జన్మనిచ్చినప్పుడు వారిని చూస్తూ నా కొడుకు ఒక ఐపీఎస్, ఇంజనీరు, డాక్టర్ కావాలని కోరుకుంటారని అదే ఆడబిడ్డ పుడితే కలెక్టర్, లాయర్, డాక్టర్ ఇలా అనేక రంగాల్లో రాణించాలని కలలు కంటారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత విద్య కోసం త్యాగాలు చేస్తూ విదేశాలకు పంపిస్తున్నారని ఆ విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకొని తల్లిదండ్రుల ఆశలను, కలలను నిలబెట్టాలని కోరారు . ఆడది అంటే అబల కాదు సభల అని నిరూపించాలని, ఎంతటి కష్టం వచ్చినా అత్యంత ధైర్యంతో అదురు,బెదురు లేకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలో వివిధ రంగాలలో గణనీయమైన కృషి చేసి శాశ్వత ప్రభావాన్ని చూపిన మహిళల గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది.
మహోన్నతమైన,ఆదర్శవంతమైన మహిళలకు మనదేశంలో కొదవలేదు. ముఖ్యంగా భారతదేశపు తొలి ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ , చరిత్రలో రాజ్యాల్ని ఏలిన రాణి రుద్రమదేవి, భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మహిళా కల్పనా చావ్లా లాంటి వారు చాలామంది ఉన్నారు.
ఆడది అంటే అబల కాదు సబల అని పురాణ ఇతిహాసాలోనే ఉంది ప్రస్తుత ప్రపంచంలోను మన మహిళలు తమ శక్తిని చాటుతున్నారు.
స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్న ఈ ఘన స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంలో మహిళా బిల్లును ఆమోదింప చేసుకోకపోవడం దురదృష్టకరమైన విషయం.
1990 నుండి పెండింగ్లో ఉన్న మహిళా బిల్లు కోసం మహిళా లోకం ఎదురుచూస్తుంది.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ చట్టం అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రతీ మహిళ తన హక్కులను బాధ్యతలు తెలుసుకొని, తనకున్న శక్తి,యుక్తులను సమగ్రంగా ఆవిష్కరించుకొని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ధైర్యాన్ని,సామర్థ్యాన్ని,స్వేచ్ఛను కలిగి ఉండటం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సహాయం తీసుకోకుండా స్వతంత్రంగా ఉండటమే మహిళా సాధికారత.
గత 05 సంవత్సరాలుగా మా సివిల్ టెక్లాబ్స్ ద్వారా అనేక సాంఘిక కార్యక్రమాలు యువతను ఉపాధి కార్యక్రమాలు, అనాదలకు బియ్యం పంపిణీ చలి కాలం లో దుప్పట్లు పంపిణీ లాంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని,ఎంతో మంది ప్రజలకు సేవలు చేశామని తెలిపారు. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా సివిల్ టెచ్ లాబ్స్ పరిధిలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎంతో మంది మహిళలు వారి స్వశక్తితో వివిధ రంగాల్లో పురుషులకు సమానంగా రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆస్పూర్తిని అభద్రతాభావం కలిగిన మహిళల్లో ఆత్మస్థైర్యం నింపుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు
సుపీరియర్ లాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ గారు మాట్లాడుతూ
ఎత్రనారేస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత
అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని దాని అర్థం.
స్త్రీని దేవతగా పూజించకపోయినా పరవాలేదు కానీ స్త్రీ కూడా పురుషునితో సమానం అనే నిజాన్ని గ్రహిస్తే చాలు.
కానీ నేడు అలా జరగటం లేదు. అయినా మొక్కువోని దీక్షతో సమాజంలో కొందరు మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిగమిస్తూ శ్రీ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఏ రంగంలోనూ పురుషులకు తీసిబోమని ప్రతిక్షణం నిరూపిస్తూనే ఉన్నారు. విద్య,వైద్యం,వ్యాపార,రాజకీయం, క్రీడలు,నటన, టెక్నాలజీ ,బ్యాంకింగ్ హెల్త్ కేర్ అంతరిక్షంలో ఇలా ప్రతి రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేస్తూ రాణిస్తు మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మన దేశంలో ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురి అవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. ఇందుకు కారణాలలేమిటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ టెక్ లాబ్స్ యాజమాన్యం మరియు సిబ్బంది మహిళలు, తదితరులు పాల్గొన్నారు.