హైదరాబాద్: కళావేదిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన కళావేదిక మాసపత్రికను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రధానం చేశారు. ఇందులో భాగంగా యూట్యూబ్ రంగంలో 1000కి పైగా షార్ట్ ఫిల్మ్స్ ను నిర్మించి ఔరా.. అనిపించే విధంగా ప్రేక్షకులను అలరిస్తున్న షార్ట్ ఫిలిమ్స్ దర్శకులు రాము మొగిలోజికి బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందజేశారు. విధంగా 2000 షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన సుమన్ గౌడ్ కు, నటి రవళిలకు బెస్ట్ యాక్టర్స్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అవార్డులను అందుకున్న దర్శకులు రాము మొగిలోజి, నటీనటులు సుమన్ గౌడ్, రవళి మాట్లాడుతూ గ్రామీణ యాస, భాషలో షార్ట్ ఫిల్మ్స్ ను నిర్మిస్తూ, కోట్లాదిమంది ప్రజలను అలరించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు. తమ ప్రతిభను గుర్తించి కళావేదిక సంస్థ తమకు అవార్డులను ప్రధానం చేయడం హర్షనీయమని అన్నారు. అవార్డులను తీసుకున్న దర్శకులు రాము మొగిలోజి, సుమన్ గౌడ్ రవళిలను పలువురు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
రాము మొగిలోజి, సుమన్ గౌడ్, రవళికి అవార్డుల ప్రధానం
RELATED ARTICLES