Monday, December 23, 2024

బ్రాహ్మణాభ్యుదయా పరిషత్ నూతన కార్యవర్గం ఎన్నిక

సరూర్‌నగర్‌: బ్రాహ్మణాభ్యుదయా పరిషత్ నూతన కార్యవర్గం ఎన్నికయ్యింది. గొట్టిముక్కుల నరసింహశర్మ అధ్యక్షతన సోమవారం సాయంత్రం సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అధ్యక్షులుగా డేరం భాస్కర్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా చింతలపల్లి మధుబాబు శర్మ, ట్రెజరర్‌ గా డేరం గోపికృష్ణ శర్మ,ప్రచార కార్యదర్శిగా ఎల్లికంటి వంశికృష్ణశాస్త్రి లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డేరం రాము, కుర్మెటి రాము, పాల నరేంద్ర, సీహెచ్.నరేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular