Tuesday, December 24, 2024
Home Blog Page 53

ఆరోగ్య వాతావరణం కల్పించాలని స్థానికులు ముక్తకంఠంతో అభ్యర్థిస్తున్నారు:: విజయ్ *.

0

*ఆరోగ్య వాతావరణం కల్పించాలని స్థానికులు ముక్తకంఠంతో అభ్యర్థిస్తున్నారు:: విజయ్ *

శేర్లింగంపల్లి మార్చి 21:( గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).

శేర్లింగంపల్లి పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో చెరువు సమీపంలో నివసిస్తున్న ప్రజలకు డ్రైనేజీ సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తూ తీవ్ర అనారోగ్యం పరిస్థితులను ఎదుర్కొనవలసిన దుస్థితికి చేరుకున్నా కూడా కనీస పక్షంలో అధికారులు జలమండలి సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయక పోవడంపై ప్రజలందరూ అసంతృప్తి వెలిబుచ్చుతున్నారని, జలమండలి అధికారులు సత్వరమే సమస్యను పరిష్కరించి దానికి నివాసితులకు ఆరోగ్య వాతావరణం కల్పించాలని బస్తి నివాసితుడు విజయ్, స్థానికులు ముక్తకంఠంతో అభ్యర్థిస్తున్నారు.

ప్రవీణుడికి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘ సేవకుడి ఉగాది పురస్కార్

0
  • ప్రవీణుడికి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘ సేవకుడి ఉగాది పురస్కార్

శేర్లింగంపల్లి మార్చి 20 (గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).

శేరిలింగంపల్లి , గత 2013 సంవత్సరం నుండి అందరికీ విద్య అందుబాటులో విద్య అనే అంశంతో  ప్రారంభించబడి ఈ హోలీ ప్రిన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ /ఫౌండేషన్ & మినిస్ట్రీస్ ద్వారా  ఎందరో అనాధ బిడ్డలకు, తల్లీ లేదా తండ్రీ లేని పిల్లలకు ఉచిత విద్య , వసతి కల్పిస్తూ వృద్దులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు దైవ భక్తితో పాటు చదువులేని వాళ్లకు అక్షరాభ్యాసం చేయిస్తూ, స్వశక్తితో అభివృద్ధి లోనికి రావాలనుకున్న వారికి ఆరోగ్య పరంగా , శారీరక పరంగా ఫ్రీ మెడికల్ క్యాంపులు, కంప్యూటర్ ట్రైనింగ్ క్లాసెస్, టైలరింగ్ క్లాసెస్, ఎంబ్రాయిడరీ క్లాసెస్, జూట్ బాక్స్ క్లాసెస్, స్వయం కృషి ఉపాధి పనులను కల్పిస్తూ, నేటి సమాజంలో ఉన్న లోపాలపై అవగాహన కల్పిస్తూ, నిరాశ నిస్పృహల జీవితాలను ఈ సమాజంలో చైతన్యవంతులుగా జీవించడానికి హక్కు కల్పిస్తూ , చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపే హోలీ ప్రిన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ /ఫౌండేషన్ అండ్ మినిస్ట్రీస్. ఈ ప్రవీణుడికి శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు వారి ఆధ్వర్యంలో ఉగాది పండగ ను పురస్కరించుకొని పాలమూరు పురప్రముఖులకు వివిధ రంగాలలో ఉత్తమ సేవలను అందించిన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రలకు చెందిన ఉత్తమ సంఘ సేవకుడు కొమ్ము ప్రవీణ్ కుమార్ ను 19వ తేది ఆదివారం నాడు పాలమూరు పట్టణం లోని టీచర్స్ కాలనీ నందు మెమెంటో శాలువా సర్టిఫికెట్ అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ రాష్ట్ర తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షులు, మనోహర్ రెడ్డి, సoస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా మెట్టుకాడి శ్యామ్ సుందర్, అధ్యక్షులు డా . ప్రణీత శ్రీకరి,ప్రధాన కార్యదర్శి సంధ్య, ముఖ్య సలహా దారులు, కృష్ణవేణి,రిషి వెంకటయ్య,అయ్యప్ప సేవాసమాజం అధ్యక్షులు భగవంతురావు ఆర్ టి సి రాంచెంద్రయ్య, ముత్యమ్, సత్తయ్య విజేత వెంకట్ రెడ్డి,కార్యకర్తలు రవి కుమార్,సూరజ్ దత్తు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు , ముఖ్య అతిథులు మాట్లాడుతూ, హొలీ ప్రిన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ/ ఫౌండేషన్ & మినిస్ట్రీస్ (పాస్టర్/ఫౌండర్/ చైర్మన్/ డైరెక్టర్ & కరస్పాండెంట్) అయిన ఈ ప్రవీణుడు, ఎంతోమంది అభాగ్యులకు అందిస్తున్న ఈ నిస్వార్థమైన స్వచ్ఛమైన ఆదర్శమైన సేవకు ఈ అవార్డుతో సన్మానించడం మాకెంతో సంతోషం అని తెలియజేశారు.

మహిళ చైతన్యమే సమాజ మార్పు.: ఏఐఎప్డీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య.*

0

మహిళ చైతన్యమే సమాజ మార్పు.: ఏఐఎప్డీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య.

శేర్లింగంపల్లి మార్చి 20: (గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).

మహిళలు చైతన్యవంతంగా ముందుకు కదిలినప్పుడే సమాజం మారుతుందని ఏఐఎప్డీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నుండి 23 వరకు ఎఐఎఫ్ డి డబ్ల్యు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్టాలిన్ నగర్ లో స్టాలిన్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలను  నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన సుకన్య గారు మాట్లాడుతూ , ప్రస్తుత పురుషాధిపత్య సమాజంలో మహిళలు ఇంకా అనిగిమనిగి ఉండవలసిన అవసరం లేదని మారుతున్న పరిణామ క్రమానికి అనుగుణంగా చైతన్యవంతం కావలసిన అవసరం ఉందని,మహిళలకు హక్కులు,సమానత్వం,స్వేచ్ఛ కోసం పోరాడాలని మహిళా చైతన్యమే సమాజ మార్పుకు దోహం పడుతుందని అన్నారు. ఆ కోణంలో మహిళలు నిరక్షరాస్యత నుండి హింస నుండి వివక్ష నుండి పురుషాధిపత్య వ్యత్యాసం నుండి బయటపడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యు రాష్ట్ర నాయకురాలు పి భాగ్యమ్మ మాట్లాడుతూ, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 15 రోజులపాటు ఘనంగా జరుపుతున్నామని మహిళలు మరింత ఉత్సాపూరితంగా, స్వేచ్ఛగా సమాజంలో ముందుకు సాగడానికి స్టాలిన్ నగర్ లో నిర్వహించిన క్రీడలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ప్రతి సందర్భంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాల వలన మహిళలు మానసికంగా, ఆరోగ్యంతో ఉండేందుకు దోహదపడతాయని తెలియజేశారు. వివిధ క్రీడలలో గెలుపొందిన వారికి కుంభం సుకన్య,పి.భాగ్యమ్మ, ఎం రాణి, దారా లక్ష్మి, ఎం.రమేష్, ఎన్.గణేష్ లు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.శంకర్, వనం రాధ, వనజ, కే.లావణ్య, చెన్నమ్మ, అనురాధ,చిట్టి,కే.లక్ష్మి,లత,భాగ్యలక్ష్మి,సుజాత, యల్.లక్ష్మి, నాగమణి, సమీన తదితరులు పాల్గొన్నారు.

రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్

0

రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్ మార్చ్ 19:( గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).

శేర్లింగంపల్లి పరిధిలోని హెచ్సియు సమీపంలో ఉన్న రేణుక ఎల్లమ్మ దేవాలయంలో రాజీవ్ గ్రుహకల్ప నివాసితుడైన ఎస్బి చారి రేణుక ఎల్లమ్మ సన్నిదిలో మొక్కిన మొక్కులు తీరినందుకు, రేణుక ఎల్లమ్మ కు ఆలయంలో ఘనంగా పూజలు చేసి, ఆలయ ఆవరణలో ప్రత్యేక అన్నప్రసాదాలను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా రాగం నాగేందర్ యాదవ్ ను ఎస్బి చారి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం, రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, రేణుక ఎల్లమ్మ ను భక్తితో ఆరాదించినట్లయితే అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చని , అమ్మవారి క్రుపకు పాత్రులై, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రేణుక ఎల్లమ్మ అనుగ్రహానికి పాత్రులై మొక్కులు తీర్చుకొని ఆశీర్వచనాలు పొందాలని ఆకాంక్షించారు. విచ్చేసిన బందుమిత్ర, శ్రేయోభిలాషులకు రేణుక ఎల్లమ్మ దేవాఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అన్న ప్రసాదాలను ఎస్బి చారి స్వయంగా వడ్డించగా , అందరూ త్ర్రప్తిగా ఆరగించి , అమ్మవారి ఆశీస్సులతో ఎల్లవేళలా సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను ఎస్బీ చారి కలిగి వుండాలని వేడుకొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాగం నాగేందర్ యాదవ్ కు బందుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజీవ్ గృహకల్ప వార్డ్ మెంబర్ శ్రీకళ కు , వెంకట్ రెడ్డి కి , టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లకు , కార్యకర్తలకు , ప్రతి ఒక్కరికీ ఎస్బీ చారి హ్రుదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

గణేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకల సందర్బంగా అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం.

0

*గణేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకల సందర్బంగా
అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం.*

శేర్లింగంపల్లి మార్చి19 (గ్రేట్ తెలంగాణ రిపోర్టర్ ):బీజేపీ సీనియర్ నాయకులు ఆర్ కె వై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఆదివారం రోజు ఘనంగా జరిగాయి. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మియాపూర్ డివిజన్ లోని స్వాధర్ గ్రేహ్ మహిళా వికలాంగుల అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనాధలకు, పేదలకు తన పుట్టినరోజు సందర్భంగా సేవ చేయాలనే సదుద్దేశంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు గణేష్, అతని స్నేహితులు తెలిపారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ల సమక్షంలో కేక్ కట్ చేసి గణేష్ ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని ప్రజలకు సేవేచేసే అవకాశం కల్పించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీను, శివరాజ్, వంశీ, రాము, మల్లేష్, పాపయ్య, శ్రీధర్, సోను, నరేష్, హరి, దుర్గేష్, ప్రశాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

గుండె గణేష్ ముదిరాజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రమాస్ రెడ్డి. .

0

*గుండె గణేష్ ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రమాస్ రెడ్డి*.

మార్చి 19 (గ్రేట్ తెలంగాణ రిపోర్టర్:)శేర్లింగంపల్లి మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పేట్ బిజెపి పార్టీ సీనియర్ నాయకులు ఆర్ కే వై టీం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బిజెపి నాయకులు చంద్రమాస్ రెడ్డి గుండె గణేష్ ముదిరాజ్ ను కలిసి ఘనంగా గజమాలతో సత్కరిస్తూ , కేక్ తిననిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

గౌతమీనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లను వేయాలి – కసిరెడ్డి భాస్కరరెడ్డి…

0

గౌతమీనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లను వేయాలి – కసిరెడ్డి భాస్కరరెడ్డి…

శేర్లింగంపల్లి మార్చి18 (గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).రంగారెడ్డి జిల్లా ,శేర్లింగంపల్లి, చందానగర్ డివిజన్ గౌతమీనగర్ కాలనీలో పూర్తిస్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు వేయాలని బిజెపి నాయకుడు, గౌతమీనగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ కసిరెడ్డి భాస్కరరెడ్డి కోరారు. శనివారం అసోసియేషన్ అద్యక్షుడు నూనె సురేందర్ తో కలిసి జోనల్ కమీషనర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన సందర్భంగా జోనల్ కమీషనర్ తో ఫోన్ లో మాటాడి సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. శేరిలింగంపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేని కాలనీ బహుశా గౌతమీనగర్ కావొచ్చని ,ప్రణాళికాబద్ధంగా,నాణ్యతతో కూడిన సౌకర్యాలను కల్పించాలని, కసిరెడ్డి భాస్కరరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నూనె సురేందర్, మురళీధర్, రామస్వామి, డాక్టర్ ఎస్. వి. రావ్, సాయికుమార్, జ్ఞానేశ్వర్, నర్సింహ, సత్యరమేశ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

0

ఎంపీ రంజిత్ రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహం ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకొని, కష్టపడి చదవాలి : హమీద్ పటేల్   .

శేర్లింగంపల్లి మార్చి18 (గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).

రంగారెడ్డి జిల్లా ,శేర్లింగంపల్లి, కొండాపూర్ డివిజన్ పరిధిలోనీ కొత్తగూడ విలేజ్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా. గడ్డం రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా, ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలకు సంసిద్ధం అవుతున్న, విద్యార్థిని, విద్యార్థులకు, పలువురు నాయకులతో కలసి ఉచిత ఎగ్జామ్స్ ప్యాడ్ లను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ చేతుల మీదుగా పంపిణీ చేసారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చదువుకొనే దశలో అతి కీలకమైన విద్యా సంవత్సరం ఈ పదవ తరగతి అని అన్నారు. ఈ పదవ తరగతిలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను బట్టే వారి భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుందని అన్నారు. అతి ముఖ్యమైన ఈ సంవత్సర కాలాన్ని ఏ విద్యార్థి కూడా వృధా చెయ్యకుండా ఉండాలని, మంచి మార్కులతో పదవ తరగతి ఉత్తిర్ణులై చదువుకున్న పాఠశాలకు, చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకోని రావాలని కోరారు. చేవెళ్ల ఎంపీ డా. రంజిత్ రెడ్డి ఎంతో పెద్ద మనసుతో మన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా ఈ సంవత్సరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, వారి కృషికి ఫలితంగా అందరూ కూడా మంచి మార్కులతో ఉత్తిర్ణులు కావాలని కోరారు. ఈ సందర్బంగా పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు థాంక్యూ ఎంపీ రంజిత్ రెడ్డి సార్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మొహ్మద్ మొయినుద్దీన్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణ గౌడ్, తెరాస సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, షేక్ చాంద్ పాషా, రక్తపు జంగంగౌడ్, కేశం కుమార్ ముదిరాజ్, ఎర్రరాజు, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, సాయి శామ్యూల్ కుమార్, జహీర్, రాహుల్, పదవ తరగతి విద్యారిని విద్యార్థులు పాల్గొన్నారు.

బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపు రాబోయే ఎన్నికలకు శుభ సంకేతం:: గజ్జల యోగానంద్

0

 

శేర్లింగంపల్లి మార్చి 18 (గ్రేట్ తెలంగాణ న్యూస్ రిపోర్టర్):

రంగారెడ్డి జిల్లా , శేరిలింగంపల్లి బిజెపి పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ ఆధ్వర్యంలో స్థానిక మియాపూర్, హాఫీజ్పేట్ బిజెపి పార్టీ కార్యాలయంలో ఉమ్మడి మహబుబ్ నగర్ –
రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ, టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపు మోదీ ప్రభుత్వ సుపరిపాలనకు అద్దం పడుతుందని, ఈ గెలుపు ఒక శుభ సంకేతమని, ఈ గెలుపులో బీజేపీ కార్యకర్తలందరు కష్టపడి పని చేసినందుకు అభినందనలు తెలియచేసారు. శేరిలింగంపల్లి కార్యకర్తలు, నాయకులు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు ఒక విధంగా ఈ ఎన్నికలలో పని చేసారని , కొందరు ఫోన్ ల ద్వారా, కొందరు కాల్ సెంటర్ ద్వారా, కొందరు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం, మరికొందరు డేటా తయారు చేసి డివిజన్ లకు అందజేయడం , కార్యకర్తల నిబద్ధతకు నిదర్శనమని , ఈ గెలుపు అందరి సమిష్టి విజయం అని పేర్కొన్నారు, సంబరాలలో పాల్గొన్న కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కలుస్తూ, నృత్యాలతో ఇదొక ఇంటి పండుగగా జరుపోకోవడంపై ఆనందం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో టీచర్లు ఎన్నో బాధలు పడుతున్నారని, వారి ఏ సమస్యలనూ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదని, బదిలీలలో పారదర్శకత లేదని, వేతన సవరణలో ఎన్నో లోపభూయిష్ఠలు ఉన్నాయని యోగానంద్ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు 452 వరకూ నమోదయ్యాయి. ఈ విషయంలో రాబోయే ఎన్నికలలో చొరవ తీసుకొని ఒక్క చెల్లని ఓటు లేకుండా చూసుకోవలసిన బాధ్యత మన అందరి పై ఉందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను బిఆర్ఎస్ కీలకంగా తీసుకున్నా, బిజెపి ఈ ఎన్నికల ఫలితాలలో విజయం సాధించి గులాబీ అధినేతలకు తగిన గుణ పాఠం చెప్పిందని అన్నారు. బిజెపి పార్టీ పిలుపుపై నమ్మకంతో ఓటు వేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు, విద్యావంతులు కెసిఆర్ కి తగిన బుద్ది చెప్పారని , ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్య ప్రజలు కూడా బీఆర్ఎస్ పాలనకు చెరమ గీతం పాడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ మణిభూషన్ , రాష్ట్ర నాయకులు మువ్వా సత్యనారాయణ, మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేష్ ,రాష్ట్ర ఎస్సీ మోర్చ అధికార ప్రతినిధి కాంచన కృష్ణ ,జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చి రెడ్డి , డి ఎస్ ఆర్ కే ప్రసాద్, మనోహర్ జిల్లా కార్యదర్శి బొబ్బ నవతా రెడ్డి, జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి , ఓబీసీ మూర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జితేందర్ , జిల్లా గీతాలు కన్వీనర్ రవి గౌడ్, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మాణిక్రావ్, రాజుశెట్టి, ఆంజనేయులు , రామిరెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ వెలగా శ్రీనివాస్ , పార్టీ నాయకులు కార్యకర్తలు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంక్షేమ గురుకుల పాఠశాల ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

0

హైదరాబాద్, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి:

గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశం పొందుటకు ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని/ విద్యార్థులు ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష రాయుటకు అర్హులు…గురుకుల విద్యార్థుల ప్రవేశం కొరకు మార్చి 16 చివరి తేదీ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు 2023 మార్చి 20వ తారీకు వరకు పొడిగించడం జరిగింది. కావున తప్పనిసరిగా 5 టీజీ సెట్ 2023 పరీక్షకు ఎవరైనా దరఖాస్తు పెట్టుకోని  వారు మార్చి 20వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు పెట్టుకోగలరు.

ప్రవేశ పరీక్ష తేదీ:-
23/04/2023(ఆదివారము)

ఇట్లు
హయత్ నగరు పాఠశాల / కళాశాల ప్రధానాచార్యులు
శ్రీ C.జగదీశ్వర్ రెడ్డి.