శేర్లింగంపల్లి మార్చి 18 (గ్రేట్ తెలంగాణ న్యూస్ రిపోర్టర్):
రంగారెడ్డి జిల్లా , శేరిలింగంపల్లి బిజెపి పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ ఆధ్వర్యంలో స్థానిక మియాపూర్, హాఫీజ్పేట్ బిజెపి పార్టీ కార్యాలయంలో ఉమ్మడి మహబుబ్ నగర్ –
రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ, టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపు మోదీ ప్రభుత్వ సుపరిపాలనకు అద్దం పడుతుందని, ఈ గెలుపు ఒక శుభ సంకేతమని, ఈ గెలుపులో బీజేపీ కార్యకర్తలందరు కష్టపడి పని చేసినందుకు అభినందనలు తెలియచేసారు. శేరిలింగంపల్లి కార్యకర్తలు, నాయకులు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు ఒక విధంగా ఈ ఎన్నికలలో పని చేసారని , కొందరు ఫోన్ ల ద్వారా, కొందరు కాల్ సెంటర్ ద్వారా, కొందరు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం, మరికొందరు డేటా తయారు చేసి డివిజన్ లకు అందజేయడం , కార్యకర్తల నిబద్ధతకు నిదర్శనమని , ఈ గెలుపు అందరి సమిష్టి విజయం అని పేర్కొన్నారు, సంబరాలలో పాల్గొన్న కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కలుస్తూ, నృత్యాలతో ఇదొక ఇంటి పండుగగా జరుపోకోవడంపై ఆనందం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో టీచర్లు ఎన్నో బాధలు పడుతున్నారని, వారి ఏ సమస్యలనూ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదని, బదిలీలలో పారదర్శకత లేదని, వేతన సవరణలో ఎన్నో లోపభూయిష్ఠలు ఉన్నాయని యోగానంద్ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు 452 వరకూ నమోదయ్యాయి. ఈ విషయంలో రాబోయే ఎన్నికలలో చొరవ తీసుకొని ఒక్క చెల్లని ఓటు లేకుండా చూసుకోవలసిన బాధ్యత మన అందరి పై ఉందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను బిఆర్ఎస్ కీలకంగా తీసుకున్నా, బిజెపి ఈ ఎన్నికల ఫలితాలలో విజయం సాధించి గులాబీ అధినేతలకు తగిన గుణ పాఠం చెప్పిందని అన్నారు. బిజెపి పార్టీ పిలుపుపై నమ్మకంతో ఓటు వేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు, విద్యావంతులు కెసిఆర్ కి తగిన బుద్ది చెప్పారని , ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్య ప్రజలు కూడా బీఆర్ఎస్ పాలనకు చెరమ గీతం పాడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ మణిభూషన్ , రాష్ట్ర నాయకులు మువ్వా సత్యనారాయణ, మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేష్ ,రాష్ట్ర ఎస్సీ మోర్చ అధికార ప్రతినిధి కాంచన కృష్ణ ,జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చి రెడ్డి , డి ఎస్ ఆర్ కే ప్రసాద్, మనోహర్ జిల్లా కార్యదర్శి బొబ్బ నవతా రెడ్డి, జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి , ఓబీసీ మూర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జితేందర్ , జిల్లా గీతాలు కన్వీనర్ రవి గౌడ్, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మాణిక్రావ్, రాజుశెట్టి, ఆంజనేయులు , రామిరెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ వెలగా శ్రీనివాస్ , పార్టీ నాయకులు కార్యకర్తలు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.