గౌతమీనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లను వేయాలి – కసిరెడ్డి భాస్కరరెడ్డి…
శేర్లింగంపల్లి మార్చి18 (గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).రంగారెడ్డి జిల్లా ,శేర్లింగంపల్లి, చందానగర్ డివిజన్ గౌతమీనగర్ కాలనీలో పూర్తిస్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు వేయాలని బిజెపి నాయకుడు, గౌతమీనగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ కసిరెడ్డి భాస్కరరెడ్డి కోరారు. శనివారం అసోసియేషన్ అద్యక్షుడు నూనె సురేందర్ తో కలిసి జోనల్ కమీషనర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన సందర్భంగా జోనల్ కమీషనర్ తో ఫోన్ లో మాటాడి సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. శేరిలింగంపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేని కాలనీ బహుశా గౌతమీనగర్ కావొచ్చని ,ప్రణాళికాబద్ధంగా,నాణ్యతతో కూడిన సౌకర్యాలను కల్పించాలని, కసిరెడ్డి భాస్కరరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నూనె సురేందర్, మురళీధర్, రామస్వామి, డాక్టర్ ఎస్. వి. రావ్, సాయికుమార్, జ్ఞానేశ్వర్, నర్సింహ, సత్యరమేశ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.