- ప్రవీణుడికి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘ సేవకుడి ఉగాది పురస్కార్
శేర్లింగంపల్లి మార్చి 20 (గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).
శేరిలింగంపల్లి , గత 2013 సంవత్సరం నుండి అందరికీ విద్య అందుబాటులో విద్య అనే అంశంతో ప్రారంభించబడి ఈ హోలీ ప్రిన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ /ఫౌండేషన్ & మినిస్ట్రీస్ ద్వారా ఎందరో అనాధ బిడ్డలకు, తల్లీ లేదా తండ్రీ లేని పిల్లలకు ఉచిత విద్య , వసతి కల్పిస్తూ వృద్దులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు దైవ భక్తితో పాటు చదువులేని వాళ్లకు అక్షరాభ్యాసం చేయిస్తూ, స్వశక్తితో అభివృద్ధి లోనికి రావాలనుకున్న వారికి ఆరోగ్య పరంగా , శారీరక పరంగా ఫ్రీ మెడికల్ క్యాంపులు, కంప్యూటర్ ట్రైనింగ్ క్లాసెస్, టైలరింగ్ క్లాసెస్, ఎంబ్రాయిడరీ క్లాసెస్, జూట్ బాక్స్ క్లాసెస్, స్వయం కృషి ఉపాధి పనులను కల్పిస్తూ, నేటి సమాజంలో ఉన్న లోపాలపై అవగాహన కల్పిస్తూ, నిరాశ నిస్పృహల జీవితాలను ఈ సమాజంలో చైతన్యవంతులుగా జీవించడానికి హక్కు కల్పిస్తూ , చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపే హోలీ ప్రిన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ /ఫౌండేషన్ అండ్ మినిస్ట్రీస్. ఈ ప్రవీణుడికి శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు వారి ఆధ్వర్యంలో ఉగాది పండగ ను పురస్కరించుకొని పాలమూరు పురప్రముఖులకు వివిధ రంగాలలో ఉత్తమ సేవలను అందించిన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రలకు చెందిన ఉత్తమ సంఘ సేవకుడు కొమ్ము ప్రవీణ్ కుమార్ ను 19వ తేది ఆదివారం నాడు పాలమూరు పట్టణం లోని టీచర్స్ కాలనీ నందు మెమెంటో శాలువా సర్టిఫికెట్ అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ రాష్ట్ర తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షులు, మనోహర్ రెడ్డి, సoస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా మెట్టుకాడి శ్యామ్ సుందర్, అధ్యక్షులు డా . ప్రణీత శ్రీకరి,ప్రధాన కార్యదర్శి సంధ్య, ముఖ్య సలహా దారులు, కృష్ణవేణి,రిషి వెంకటయ్య,అయ్యప్ప సేవాసమాజం అధ్యక్షులు భగవంతురావు ఆర్ టి సి రాంచెంద్రయ్య, ముత్యమ్, సత్తయ్య విజేత వెంకట్ రెడ్డి,కార్యకర్తలు రవి కుమార్,సూరజ్ దత్తు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు , ముఖ్య అతిథులు మాట్లాడుతూ, హొలీ ప్రిన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ/ ఫౌండేషన్ & మినిస్ట్రీస్ (పాస్టర్/ఫౌండర్/ చైర్మన్/ డైరెక్టర్ & కరస్పాండెంట్) అయిన ఈ ప్రవీణుడు, ఎంతోమంది అభాగ్యులకు అందిస్తున్న ఈ నిస్వార్థమైన స్వచ్ఛమైన ఆదర్శమైన సేవకు ఈ అవార్డుతో సన్మానించడం మాకెంతో సంతోషం అని తెలియజేశారు.