హైదరాబాద్, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి:
గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశం పొందుటకు ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని/ విద్యార్థులు ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష రాయుటకు అర్హులు…గురుకుల విద్యార్థుల ప్రవేశం కొరకు మార్చి 16 చివరి తేదీ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు 2023 మార్చి 20వ తారీకు వరకు పొడిగించడం జరిగింది. కావున తప్పనిసరిగా 5 టీజీ సెట్ 2023 పరీక్షకు ఎవరైనా దరఖాస్తు పెట్టుకోని వారు మార్చి 20వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు పెట్టుకోగలరు.
ప్రవేశ పరీక్ష తేదీ:-
23/04/2023(ఆదివారము)
ఇట్లు
హయత్ నగరు పాఠశాల / కళాశాల ప్రధానాచార్యులు
శ్రీ C.జగదీశ్వర్ రెడ్డి.