ఎంపీ రంజిత్ రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహం ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకొని, కష్టపడి చదవాలి : హమీద్ పటేల్ .
శేర్లింగంపల్లి మార్చి18 (గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).
రంగారెడ్డి జిల్లా ,శేర్లింగంపల్లి, కొండాపూర్ డివిజన్ పరిధిలోనీ కొత్తగూడ విలేజ్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా. గడ్డం రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా, ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలకు సంసిద్ధం అవుతున్న, విద్యార్థిని, విద్యార్థులకు, పలువురు నాయకులతో కలసి ఉచిత ఎగ్జామ్స్ ప్యాడ్ లను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ చేతుల మీదుగా పంపిణీ చేసారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చదువుకొనే దశలో అతి కీలకమైన విద్యా సంవత్సరం ఈ పదవ తరగతి అని అన్నారు. ఈ పదవ తరగతిలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను బట్టే వారి భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుందని అన్నారు. అతి ముఖ్యమైన ఈ సంవత్సర కాలాన్ని ఏ విద్యార్థి కూడా వృధా చెయ్యకుండా ఉండాలని, మంచి మార్కులతో పదవ తరగతి ఉత్తిర్ణులై చదువుకున్న పాఠశాలకు, చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకోని రావాలని కోరారు. చేవెళ్ల ఎంపీ డా. రంజిత్ రెడ్డి ఎంతో పెద్ద మనసుతో మన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా ఈ సంవత్సరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, వారి కృషికి ఫలితంగా అందరూ కూడా మంచి మార్కులతో ఉత్తిర్ణులు కావాలని కోరారు. ఈ సందర్బంగా పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు థాంక్యూ ఎంపీ రంజిత్ రెడ్డి సార్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మొహ్మద్ మొయినుద్దీన్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణ గౌడ్, తెరాస సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, షేక్ చాంద్ పాషా, రక్తపు జంగంగౌడ్, కేశం కుమార్ ముదిరాజ్, ఎర్రరాజు, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, సాయి శామ్యూల్ కుమార్, జహీర్, రాహుల్, పదవ తరగతి విద్యారిని విద్యార్థులు పాల్గొన్నారు.