హైదరాబాద్: క్షయ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహించారు. జిహెచ్ఎంసి పరిధిలోని బాలానగర్ వైద్య సిబ్బంది మూసాపేట్ జనతా నగర్ లో ఇంటింటికి తిరుగుతూ క్షయ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. జేడీ డాక్టర్ రాజేశం సిబ్బంది పనితీరును పరిశీలించి రోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు క్షయ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. క్షయ వ్యాధి సోకిన రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి సూచనలు చేసినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మోహన్, రామకృష్ణ, వాలంటీర్లు పాల్గొన్నారు.
క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన: జేడీ డాక్టర్ రాజేశం
RELATED ARTICLES