ఎల్బీనగర్: డీఎస్ ఆర్ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్ టోర్నమెంట్ ను తట్టిఅన్నారంలో నిర్వహించారు. రెండు నెలల పాటు నిర్వహించిన టోర్నమెంట్ లో బుధవారం ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. యువకుల్లో పోటీతత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు, క్రీడాకారులకు ట్రోఫీలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నిర్వాహకులు చంద్రశేఖర్ రెడ్డి, క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవీ సాగర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తూర్పాటి చిరంజీవి, పాండ్యన్, సాజిద్, హుస్సేన్, నవీన్, ఇమ్రాన్, బలరాం, కటికరెడ్డి అరవింద్ రెడ్డి, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
శరీర దారుఢ్యానికి క్రీడలు దోహదం: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
RELATED ARTICLES