ఎల్బీనగర్: పేద కుటుంబాలను ఆదుకునేందుక తమవంతు కృషి చేస్తున్నామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు భిక్షపతి నాయక్ ఇటీవల మరణించారు. విషయాన్ని తెలుసుకున్న చిలుక ఉపేందర్ రెడ్డి భిక్షపతి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిలుక ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలకు చేయూతనిచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భిక్షపతి నాయక్ భార్య మంగిబాయి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
భిక్షపతి నాయక్ కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయం చేసిన చిలుక ఉపేందర్ రెడ్డి
RELATED ARTICLES