ఎల్బీనగర్: జర్నలిస్టల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఈనెల 30వ తేదీన ఇబ్రహీంపట్నం కొంగరకలాన్ లో జరిగే టీయుడబ్లూజే-143 రంగారెడ్డి జిల్లా మహాసభల పోస్టర్ ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈనెల 30వ తేదీన జరిగే జిల్లా మహాసభలకు హాజరు కావాలని కోరుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం కమిటీ ఎమ్మెల్యే ను కోరారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్లూజే-143 రాష్ట్ర నాయకులు ఉప్పు సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం రమేష్, ఉపాధ్యక్షులు తగరం సత్యనారాయణ, సతీష్ యాదవ్, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు చిత్రం సైదులు, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి నాగరాజు, టెంజు అధ్యక్షులు బొంగు భరత్ గౌడ్, కార్యదర్శి సురేష్, నాయకులు గిరిగౌడ్, రవికుమార్, లింగస్వామి, అనిల్, ఆనంద్, శంకర్, శ్రీనివాస్, సాయిరాం, కరణ్, అజయ్, ధర్మనాయక్, రాఘవేందర్, శ్రీరామ్, సురేందర్, భరత్, వెంకట్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
TUWJ- H143 జిల్లా మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
RELATED ARTICLES