ఎల్బీనగర్: సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు చేస్తున్న కృషి అభినందనీయమని సరూర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అన్నారు. సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ లో శుక్రవారం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ శ్రీవాణి అంజన్ హాజరై అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చేందుకు అన్నదానాలు చేయడం హర్షణీయమని అన్నారు. ఎవరు ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రతిఒక్కరూ తోడుగా నిలవాలని సూచించారు. సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు చేస్తున్న కృషికి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. అనంతరం కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ తదితరులను శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు జమజ్యోతి రమేష్, ఉపాధ్యక్షులు వి.మోహన్, కార్యదర్శి పూజారి సురేందర్, సంయుక్త కార్యదర్శి జ్యోతి రాజు, కోశాధికారి బి.రాజన్న, సభ్యులు పాల్గొన్నారు.
సజస్రార్జున్ మహరాజ్ అన్నదానం ట్రస్టు సేవలు అభినందనీయం: కార్పొరేటర్ శ్రీవాణి అంజన్
RELATED ARTICLES