ఎల్బీనగర్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీసుల దాడికి నిరసనగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా దర్పల్లి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేసి రికార్డులను, హార్డుడిస్క్ లను సీజ్ చేయడం, ఎలాంటి ఎఫ్. వారెంట్ లేకుండా అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారపు శ్రీనివాసరావు, నాయకులు పల్స శ్రీధర్ గౌడ్, రమేష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, సునీల్ గౌడ్, శ్రీకాంత్, రంజిత్, మంజులారెడ్డి, సౌమ్య, కవిత, కరణ్, శివ, విష్ణు, గౌస్, భానుచందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన దర్పల్లి రాజశేఖరరెడ్డి
RELATED ARTICLES