హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కనుమరుగవుతున్న తరుణంలో కొవిడ్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వరుసగా ఐదో రోజు చైనాలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి. ఆదివారం ఒక్కరోజే 40,347 కొవిడ్ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ కమిషనర్ వెల్లడించింది. అందులో 3,822 కేసులు వైరస్ లక్షణాలతో ఉన్నట్లు తెలిపింది. 36,525 మందికి ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొంది. ఇక చైనాలో 3,11,624 కొవిడ్ కేసులు రికార్డు అయినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా 5,232 మంది చనిపోయారు.
చైనాలో కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు..!
RELATED ARTICLES