Monday, December 23, 2024

శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ పట్కర్ (ఖత్రి) సమాజ్ ఎల్బీనగర్ విభాగం నూతన కార్యవర్గం ఎన్నిక

ఎల్బీనగర్: శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ పట్కర్(ఖత్రి) సమాజ్ ఎల్బీనగర్ విభాగం సభ్యులు అందరూ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కరోనా సమయంలో ఎంతో మంది నిరుపేదలకు ఉచిత అన్నదానం, స్కూల్ పిల్లలకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.అనేకసార్లు మాస్కుల పంపిణీ శానిటైజర్ల పంపిణీ, వితంతువులకు బట్టలు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశామని వివరచారు. ఎందరినో కరోనా సమయంలో అదుకున్నామని అన్నారు. ఫీజులు కట్టలేని వారికి సైతం తమవంతుగా ఆదుకున్నామని అన్నారు. అలాగే భవిషత్తులో కూడా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక వసతిగృహం, ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఇది అందరి కృషితోనే సాధ్యమవుతుందని అన్నారు. ఇది మన అందరిదీ అనే భావన మనలో ఉన్నప్పుడే మనం మన లక్షాన్ని చేరుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎస్పీ స్వామి నారాయణ్ పవార్ మాట్లాడుతూ సమాజంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని, అన్నింటికీ కాకపోయిన కొందరిని అయినా తమవంతుగా సహాయం చేద్దామని ఇంత మంచి సేవా చేసే దృక్పధం ఉన్న వారిని ఇక్కడ కలుసుకున్నామని అన్నారు. తనకు సంతోషంగా ఉందని నారాయణ్ పవార్ కమిటీ సభ్యులను కొనియాడారు. తనవంతు ఏ సహాయ, సహకారాలు కావాల్సినా ముందుంటానని హామీనిచ్చారు. ఇందులో జమన్ జ్యోతి రమేష్,(ప్రెసిడెంట్) వి.మోహన్ కుమార్ జిత్రి (వైస్ ప్రెసిడెంట్), పూజారి సురేందర్(సెక్రెట్రీ), జ్యోతిరాజు(వైస్ ప్రెసిడెంట్), బాధనపల్లి రాజన్న) తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular