ఎల్బీనగర్: ఓయ్ రజినీకాంత్ వెబ్ సిరీస్ టీజర్ ను టిఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ నాగరాజు కోక దర్శకుడిగా, నటుడిగా రూపొందించిన ఓయ్ రజినీకాంత్ వెబ్ సిరీస్ ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో నాగరాజు కోక ఆధ్వర్యంలో మరిన్ని వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాలని సూచించారు. అంతకుముందు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పండాల రాజశేఖర్ గౌడ్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మన్నది వెంకటేష్, కుంచం శేఖర్, సాంకేతిక నిపుణులు హరిబాబు, మణికంఠ, రసూల్, మహేందర్ గౌడ్, రవి, సహదేవులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.