ఎల్బీనగర్: తెలంగాణ మలిదశ అమరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కాసోజు శ్రీకాంతాచారి స్మారక కమిటీ చైర్మన్ పాండురంగాచారి, వైస్ చైర్మన్ బొంగు వెంకటేష్ గౌడ్ లు అన్నారు. తెలంగాణ మలిదశ అమరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సభ ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట చౌరస్తాలో ఈనెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్లను కొత్తపేట చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి, తల్లి శంకరమ్మ తదితరులు హాజరవుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లె వినయ్ కుమార్ గౌడ్, చిక్కుళ్ల శివప్రసాద్, మహమ్మద్ ఇస్మాయిల్, మేకల శ్యాంసుందర్, పరుశురాజ్, ఐతగోని పాపయ్య గౌడ్, పాలకూరి నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాంతాచారి 13వ వర్థంతి వేడుకలను జయప్రదం చేయాలి రాయబండి పాండురంగాచారి, బొంగు వెంకటేష్ గౌడ్
RELATED ARTICLES