ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కే.కనకలక్ష్మి
గ్రేట్ తెలంగాణ:మార్చి 08, (శేర్లింగంపల్లి ఇన్చార్జి)
శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలో పాపిరెడ్డి కాలనీలోని ఆర్కే మెడల్ స్కూల్ లో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలోని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ కే.కనకలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే మెడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రత్నకుమారి కే.కనకలక్ష్మి ను శాలువాతో గౌరవప్రదంగా సత్కరించారు. అనంతరం, కే.కనకలక్ష్మి మాట్లాడుతూ,తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారి చదువుకు పూర్తి సహకారం అందించి వారికి బంగారు భవిష్యత్తును అందించాలని, పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలని, పిల్లల అభివృద్ధిని ప్రతిఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ ,ప్రిన్సిపాల్ రత్నకుమారి , ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.