దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న వారికి చట్టబద్ధత కల్పించాలి:ఇస్లావత్ దశరథ్ నాయక్
గ్రేట్ తెలంగాణ:మార్చి 07, (శేర్లింగంపల్లి ఇన్చార్జి)
శేరిలింగంపల్లి: మియాపూర్ సర్వేనెంబర్ 28లో సిఆర్పిఎఫ్. క్యాంపు సిబ్బంది జరుగుతున్న అదనపు నిర్మాణం వెంటనే నిలిపివేయాలని దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న వారికి మౌలిక సౌకర్యాలు కల్పించి చట్టబద్ధత కల్పించాలని శేరిలింగంపల్లి ఎమ్మార్వో కు ఎం.సి.పి.ఐ.యు. మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఎం.సి.పి.ఐ.యు. మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ , దశాబ్దాలుగా మియాపూర్ సర్వేనెంబర్ 28లో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న గిరిజన బడుగు బలహీన వర్గాల ఇండ్ల ను పునర్నిర్మాణానికి అలాగే ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ప్రభుత్వాలను విన్నవించుకున్న ప్రజల వినతులను పరిష్కరించలేని పరిస్థితులలో ఉందని, కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం 28 సర్వేనెంబర్ లో భూమిని సిఆర్పిఎఫ్. కు కేటాయించిందంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా నడిగడ్డ తాండ వద్ద చెక్పోస్ట్ వేసుకొని తిష్ట వేసి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నారని ప్రజల ఇండ్ల కూలిపోతున్నప్పుడు మరుగుదొడ్లు కట్టుకుంటే కూడా ఎలాంటి నిర్మాణం వస్తువులను సిఆర్పిఎఫ్. వాళ్ళు అనుమతించకపోగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కానీ వారి సిఆర్.పి.ఎఫ్. క్యాంపు విస్తరణను గత రెండు రోజులుగా ముగ్గు వేసి పునాదులు తవ్వుకుంటూ భారీ నిర్మాణానికి పూనుకుంటున్నారని ఇలాంటి పరిస్థితిని ఇటు రెవెన్యూ అధికారులు చూస్తూ ప్రజలు న్యాయం చేయాలని అర్జిస్తుంటే న్యాయం చేయకపోగా ప్రజలకు ఒక న్యాయంగా చెబుతూ ఎలాంటి స్థలం కేటాయించారన్న విషయాన్ని బహిర్గతం చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ సి.ఆర్.పి.ఎఫ్. వారికి సహకరించడం ఎంతవరకు సబాబు అని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సి ఆర్ పి ఎఫ్. నిర్మాణాలను ఆపివేయాలని దశాబ్దాలుగా నివాసాలు ఏర్పరచుకున్న గిరిజన దళిత బడుగు బలహీన వర్గాల నివాసాలను పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పల్లె మురళి కార్యవర్గ సభ్యులు దేవనూరి నరసింహ పాల్గొన్నారు.