శరీర దారుఢ్యానికి కరాటే శిక్షణ అవసరం: నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ
కరాటేలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బెల్టుల ప్రదానం.
ఎల్బీనగర్: ఫిబ్రవరి 26: గ్రేట్ తెలంగాణ న్యూస్,
మానసిక ప్రశాంతతకు, శరీర ధారోడ్యానికి కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని నారాయణగూడ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ అన్నారు. యొద్ద గోజురియో స్పోర్ట్స్ కరాటే డు ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ లోని నాగార్జున స్కూల్ లో కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణగూడ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ హాజరై విద్యార్థులకు బెల్టుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ చిన్ననాటి నుండే చదువుతో పాటు స్పోర్ట్స్ రంగంలో ప్రతిభ కనపర్చాలని సూచించారు. కరాటే శిక్షణ పొందిన వారికి స్పోర్ట్స్ కోటలో ప్రభుత్వ ఉద్యోగాలను కూడా సాధించవచ్చనని, తాను స్పోర్ట్స్ కోటలో ఉద్యోగం సాధించానని తెలిపారు. కరాటే శిక్షణ ఆత్మరక్షణతో పాటు మానసిక, శరీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. కరాటేలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ బెల్టులను ప్రదానం చేశారు. అంతకుముందు ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణను నిర్వాహకులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షుడు రాధేశ్యాం తివారి, ప్రధాన కార్యదర్శి రఘుకుమార్, చైర్మన్ రాజేశ్వర్, గ్రాండ్ మాస్టర్ విఠల్, మాస్టర్లు పి.రాము, బి.రాము, సతీష్, నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ వెంకట్, అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.