కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమ.
– పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని పి సి బి అధికారులు.
మనోహరాబాద్, ఫిబ్రవరి 27 గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
మనోహరబాద్ మండలంలోని కళ్ళకల్ పరిశ్రమల నుంచి కాలుష్యం వెదజల్లుతుంటే పిసిబి అధికారులు నిర్లక్ష్యం చూసి చూడనట్లు అలసత్వం వహిస్తున్నారని పలువురు అవేదనవ్యక్తం చేస్తున్నారు, జాతీయ రహదారికి కూతవేటు దూరములో ఉన్న మహాలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ వాయు కాలుష్యం పొగ రూపంలో వదులుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం, పరిశ్రమ నుంచి వదిలిన పొగ కాలుష్యం వల్ల రోడ్డుపై పాదాచారులు వాహనదారులు వెళ్లాలంటే పొగ కాలుష్యం మంచు రూపంలో కమ్ముకుందని తెలిపారు. చుట్టు పక్కల ప్రజలు కాలుష్యం వల్ల కల్లాకల్ గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
పి సి బి ఈ ఈ కుమార్ పాఠక్ వివరణ.
కళ్ళకల్, మహాలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ పై మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఎవరైనా గ్రామస్తులు పొల్యూషన్ వెదజల్లే పరిశ్రమపై ఫిర్యాదు చేస్తే పరిశ్రమపై తగు చర్యలు తీసుకొని. పొగ కాలుష్యం వెదజల్లకుండా నివారించేందుకు నోటీసులు జారీ చేస్తామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ ఈ కుమార్ పాటక్ తెలిపారు.