ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలి: కళ్యాణ్ కార్ జాంగిర్ జి.
రంగారెడ్డి జిల్లా గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఎస్పీ-బిఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, వచ్చే లోక్ సభ ఎన్నికలలో బిఆర్ఎస్-బిఎస్పీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించుకోవాలని బిఆర్ఎస్ నాయకులు, ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి పేర్కొన్నారు. గురువారం నాడు పత్రికా విలేకరుల సమావేశంలో కళ్యాణ్ కార్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందని, ఎన్నో ఇండస్ట్రీలు తెలంగాణకు వచ్చాయని, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజల దయనీయ జీవితాలను చూసి చలించిపోయి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, ఐపీఎస్ కి రాజీనామా చేసి, అందరికీ సమన్యాయం జరగాలని, రాజకీయాల్లోకి వచ్చినారని కొనియాడారు. మళ్లీ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు రావాలంటే బిఎస్పి-బిఆర్ఎస్ పార్టీల నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజానీకాన్ని కోరారు. మాజీ సీఎం కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ల నాయకత్వంలో రాబోవు రోజుల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అవ్వాలని ఆకాంక్షించారు.