కొండ సురేఖ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీ యస్ పి పార్టీ నల్గొండ జిల్లా సెక్రటరీ కొండ లలిత
గ్రేట్ తెలంగాణ దేవరకొండ ప్రతినిధి :
దేవరకొండ నియోజకవర్గంలో బి ఎస్ పి పార్టీ కొండ సురేఖ ఆర్ ఎస్ పి ప్రవీణ్ కుమార్ పైన చేసిన అనుచిత వాక్యాలు ను వెనక్కి తీసుకోవలెను క్షమాపణ కోరాలి లేదంటే నాలుకకు కర్రు కలిసి వాత పెట్టి రోజు కచ్చితంగా వస్తుంది అన్యాయం జరిగిన చోట కొట్లాడడం తెలియదు ప్రజలకు ముంచుకు తినేది మాత్రం బాగా తెలుసు అన్యాయం చేయడం తెలుసు అన్యాయాన్ని ప్రశ్నించి అడిగే వాళ్ళం పైన బురద చల్లడం నేర్చుకుంటున్నారు ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ నేర్పించిన సంస్కృతం సౌఖ్యత సమస్కారం కొండ సురేఖ నువ్వు నీ మొగుడు కాదా రౌడీయిజం చేసింది గుండాయిజం చేసింది ప్రజల సొమ్మును దోచుకుని తిన్నది రౌడీయిజం చేసి పదవులు సంపాదించుకొని ప్రజల సొమ్మును దోబ్బుకొని తింటున్నారు కదా మీలాగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ ప్రజల సొమ్ము తిన్నాడు రుజువు చేయండి మీలాగా దోచుకోని తినాలంటే ఆయన చేసే ఉద్యోగమే సరిపోయి ఉండేది ఒక పోలీసు అధికారిగా ఉన్నప్పుడు ఒకవైపు జీతం తినేవాడు ఒకవైపు లంచాలకు అలవాటు పడేవాడు కదా అలాంటివి చేయలేక రాజీనామా చేసి వచ్చిండు మీలాగా డబ్బు మీద ఆశ ఉంటే ఇప్పుడు ఆయన రాజీనామా చేసి మూడు సంవత్సరాలు కావస్తుంది కదా ప్రతినెల రెండు లక్షల 63 వేల జీతం తీసుకుంటున్న ఆయన రాజీనామా చేసిన నుండి ఎన్ని కోట్లు సంపాదించేవాడు ఒక్కసారి లెక్కేసుకో అలాంటి గొప్ప మనిషి మీద బురద చల్లడానికి కొంచమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి ఒక ఆడపిల్లగా నీకు సిగ్గు అనిపించడం లేదా అంత నీచంగా ప్రవర్తిస్తా ఉన్నావు నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు క్షమాపణ చెప్పాలి లేదంటే ఊహించుకోలేని పరిణామాలు ఎదుర్కొంటారు అని అన్నారు
ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఏకుల రాజారావు, బిఎస్పి పార్టీ నల్గొండ జిల్లా సెక్రటరీ కొండ లలిత, దేవరకొండ నియోజకవర్గ ట్రెజర్ గోరేటి శ్రీను, బీఎస్పీ పార్టీ నియోజకవర్గ సెక్రటరీ బాలు నాయక్, కొండమల్లేపల్లి మండల ప్రెసిడెంట్ కూర శ్రీకాంత్, బిఎస్పి మహిళ నాయకులు మున్సబ్ మాధవి, తదితరులు పాల్గొన్నారు