Monday, December 23, 2024
Home Blog Page 6

మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు.

0

మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు

ఎల్బీనగర్: గ్రేట్ తెలంగాణ ప్రతినిధి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలను ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేటలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు చంపాపేటలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యాలయంలో మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ వేడుకలకు సేవాదళ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొన్నారు.

ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా కృషి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‌హైకోర్టు శాఖ మేనేజర్ పి.రాకేష్.

0

ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా కృషి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‌హైకోర్టు శాఖ మేనేజర్ పి.రాకేష్

హైదరాబాద్: ఫిబ్రవరి 16, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‌హైకోర్టు శాఖ కార్యాలయంలో బ్యాంకు ఖాతాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ పి.రాకేష్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలను ఖాతాదారులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బ్యాంకు అన్ని సేవలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఖాతాదారుల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేకంగా బాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది ఎం.రఘుకుమార్, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

సీఐ రవికుమార్ ను సన్మానించిన జర్నలిస్టులు

0

సీఐ రవికుమార్ ను సన్మానించిన జర్నలిస్టుల

ఎల్బీనగర్ ఫిబ్రవరి 16, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

వనస్థలిపురం ఇన్ స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీఐ రవికుమార్ ను పలువురు జర్నలిస్టులు కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఇన్ స్పెక్టర్ రవికుమార్ ను సన్మానించిన వారిలో జర్నలిస్టులు శ్రీనివాస్, రవికుమార్, రమేష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

సైబర్ ముఠాల భరతం పట్టేదెవరు?

0

సైబర్ ముఠాల భరతం పట్టేదెవరు

 *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా నేస్తం కామ్రేడ్ జే ఎస్ ఆర్ బహిరంగ లేఖ* 

హైదరాబాద్, గ్రేట్ తెలంగాణ న్యూస్.

కంటికి కనిపించకుండా ఊహాతీత స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లజేయగల శత్రువులు- సైబర్ నేరగాళ్లు ఆధునిక కాలంలో అత్యధికులకు నిత్యావసరంగా మారిన అంతర్జాలంలో పోనుపోను వాళ్ళు మరింతగా రెచ్చిపోతున్నారనీ ప్రజాతంత్ర ఉద్యమకారుడు ప్రజా నేస్తమా అవార్డు గ్రహీత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జె కె ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు.డిజిటల్ విప్లవం మాటున దేశంలో సైబర్ ఉగ్రవాదం పెచ్చరిల్లి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న తీరు నిర్ఘాంతపరుస్తోందనీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ ప్రజా బంధువు అవార్డు గ్రహీత కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషి బొరా దేవన్ష్ JKR గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు

ఈ సంవత్సరం ఆరంభంనుంచి దాదాపు ఆరువారాల్లోనే తెలంగాణ వాసులనుంచి సైబర్ కేటుగాళ్లు రూ.150 కోట్లు దోచుకున్నారనీ జెకెఆర్ గారి జెయస్సార్ పేర్కొన్నారు.గతంలో రెండేళ్ల వ్యవధిలో రూ.600 కోట్ల దోపిడి రికార్డును సైబరాసురులు తాజాగా బద్దలుకొట్టారు. ‘క్రైమ్ ఇన్ ఇండియా’ పేరిట రెండునెలల క్రితం విడుదలైన నివేదికాంశాల ప్రకారం- గత అయిదేళ్లలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాల వృద్ధిరేటు 141శాతం. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశంలో సైబర్ చోరముఠాలు చేజిక్కించుకున్న మొత్తం సుమారు రూ.10,300 కోట్లని ఐ4సీ (భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం) అంచనా. వెలికిరాని కేసులలో మరెంత సొమ్ము దొంగల పాలబడిందో ఎవరికెరుకు సైబర్ దొంగల పేరెత్తితే కొన్నాళ్లక్రితం వరకు ఝార్ఖండ్లోని జాడా పేరే గుర్తుకొచ్చేది. దాన్ని తలదన్నుతూ ఇప్పుడు రాజస్థాన్లోని భరత్పుర్, యూపీలోని మధుర, హరియాణాలోని నూహ్, ఝార్ఖండ్కు చెందిన దేవ్డ్ సైబర్ నేరగాళ్ల కొత్త అడ్డాలుగా వెలుగొందుతున్నాయనీ కామ్రేడ్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్, హరియాణాల్లోని పది జిల్లాల్లో తిష్ఠ వేసి సైబరాసురులు చక్రం తిప్పుతున్నట్లు జన చైతన్య శ్రామిక రాజ్యం జరిపిన అధ్యయనం ధ్రువీకరించింది. దేశం వెలుపల చైనా, కంబోడియా, మయన్మార్ ప్రభృత ప్రాంతాలనుంచీ ముష్కర మూకలు మాయవలలు విసరుతూ పేట్రేగిపోతున్నట్లు భారతీయ శ్రామిక దళ్ చెబుతోంది.

ఈ ఉత్పాతాన్ని సాంకేతిక నిఘా, ఉమ్మడి కార్యాచరణతో దీటుగా ఎదుర్కోవడం ఎలాగన్న దానిపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలనీ కార్మిక వర్గ బోరపుత్రుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖల పేర్కొన్నారు.అంతర్జాలమే కార్యక్షేత్రంగా దేశాలు, ఖండాల ఎల్లలకు అతీతంగా మాయగాళ్లు ఎక్కడో ఉండి మరెక్కడో మోసాలకు తెగబడుతున్నారనీ నిరుపేదల హక్కుల కోసం పోరాడుతున్న నిరంతర ఉద్యమకారుడు కామ్రేడ్ నేతాజీ రాజన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంప్రదాయ నేరాల్లో చోరీ సొత్తు సగమైనా రికవరీ అవుతుందేమో, సైబర్ దోపిడుల్లో అది అయిదు శాతం కూడా దాటకపోవడం బాధితుల్ని తీవ్రంగా బాధిస్తోందనీ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషి బో రా దేవాన్ష్ జే కే ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు.అంతర్జాతీయంగా సైబర్ భద్రత సూచీలో సౌదీ అరేబియా, ఎస్తోనియా వంటివీ ఇండియా కన్నా మెరుగ్గా రాణిస్తున్నాయి. దేశంలోని 83శాతం సంస్థలు సైబర్ దాడులకు గురైనట్లు, ప్రతి పదిమంది వినియోగ దారుల్లో ఏడుగురు మోసగాళ్ల పాలబడినట్లు అధ్యయనాలు చాటుతుండగా- వ్యవస్థాగత ఉదాసీనత ఇంకా కొనసాగడమేమిటి? అని అనుక్షణం జన హితమే ధ్యేయంగా వర్గ పోరాటమే లక్ష్యంగా ప్రజాతంత్ర సమ సమాజ స్థాపన కోసం పోరాడుతున్న కమ్యూనిస్టు విప్లవకారుడు సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ ప్రశ్నించారు.

సైబర్ నేరాలపై దర్యాప్త నిమిత్తం దేశంలో మొట్టమొదటిసారి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది తెలంగాణ లోనే. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, జిల్లా సైబర్ నేర సమన్వయ కేంద్రం (డీ4సీ) అవతరణకు చొరవ చూపిన రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని ఎన్సీఆర్ బీ (జాతీయ నేరాల నమోదు సంస్థ) నివేదిక చాటుతోంది. ఎక్కడెక్కడి నుంచో ఆన్లైన్ నేరాలకు తెగబడుతున్నవాళ్లను మాటువేసి అదుపులోకి తీసుకోవడం కష్టతరమవుతోంది. ఝార్ఖండ్ పోలీసు శాఖ ‘ప్రతిబింబ్’ పేరిట రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్తో నేరగాడు ఉన్నదెక్కడో గుర్తించి పట్టి బంధించడం సులభ సాధ్యమవుతుందంటున్నారు. రాష్ట్రాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, అవి జట్టుకట్టి దొంగల వేట సాగించడం అత్యంత ఆవశ్యకం కావాలని కార్మిక వర్గ బో రా పుత్రుడు కామ్రేడ్ జె ఎస్ ఆర్ సార్ కోరారు. సైబర్ ఘాతుకాలపై ప్రజలు ఇంటినుంచే ఫిర్యాదులు చేయడానికంటూ ఆమధ్య కేంద్రం ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో వెల్లువెత్తిన ఫిర్యాదుల్లో కనీసం ఒక్కశాతమైనా ప్రాథమిక సమాచార నివేదికల నమోదుకు నోచుకోలేదంటే- పోలీసు యంత్రాంగం ఆలసత్వాన్ని ఏమనాలి? అని అభ్యుదయ వాది కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు.నేరాల ఉద్ధృతికి దీటుగా జాతీయ సైబర్ భద్రతా వ్యూహం సత్వరం రూపుదిద్దుకోవాలనీ దేహం కంటే దేశమే గొప్పదని చాటిచెబుతున్నా దేశభక్తుడు కామ్రేడ్ జై బోరన్న కోరారు.అంతర్జాలంలో చెలరేగిపోతున్న ముష్కర ముఠాల భరతం పట్టే సమష్టి కార్యాచరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా పట్టాలకు ఎక్కించాలనీ కార్మిక వర్గ బోరపుత్రుడు… సమ సమాజ స్వప్నకుడు కష్టజీవుల రాజ్యం కోసం ప్రజా నేస్తం అవార్డు గ్రహీత సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషి బో రా దేవాన్ష్ JKR గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు.

రబ్బర్ ఫామ్ లో పడి యువకుడు మృతి…

0

రబ్బర్ ఫామ్ లో పడి యువకుడు మృతి..

లివొన్ ఫామ్ పరిశ్రమలో  ఘటన…

కనీస సేఫ్టీ లేకుండా నడుపుతున్న పరిశ్రమ పై చర్యలు తీసుకోవాలనీ పలువురి స్థానికుల డిమాండ్ 

మనోహరబాద్.గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

ఎలాంటి సేఫ్టీ లు లేకుండా బయట రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులను అలుసుగా తీసుకొని వారి ప్రాణాలను బలి చేస్తున్న పరిశ్రమల పై చర్యలు తీసుకోవాలని పలువూరు డిమాండ్ చేస్తున్నారు..వివరాల ప్రకారం కల్లకల్ పారిశ్రామిక వాడలో గల లివాన్ ఫార్మ్ లో పని చేసే రాజస్థాన్ కి చెందిన కిషోర్ 22 అనే యువకుడు గత కొన్ని నెలలుగా పరిశ్రమలో పని చేస్తున్నాడు వీధిలో బాగంగా శుక్రవారం నాడు రబ్బర్ ఫార్మ్ శుద్ధి చేయడానికి పైకి ఎక్కి కాలు జారీ అందులో పారిపోవడం తో విషయం తెలుసుకున్న తోటి కార్మికులు సిబ్బంది సుమారుగా 20 నిమిషాల తరువాత డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో కార్మికుడు పడి ఉన్నాడు.వెంటనే ప్రయివేటు వాహనం లో మేడ్చల్ లో గల ఓ ఆసుపత్రికి తరలించిన ఉపయోగం లేకుండా పోయింది అప్పటికే కిషోర్ మరణించాడు అని తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.అక్కడ ఎలాంటి సేఫ్టీ లేకపోవడం కనీసం యజమానులు కూడా స్పందించక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు..ఈ ఘటన పై పలువరు మాట్లాడుతూ పొట్ట కుటి కోసం తల్లి తండ్రులు ఫ్యామిలీ నీ వదిలేసి ఇక్కడికి వస్తే వారినీ అదునుగా భావించిన పరిశ్రమ యాజమాన్యాలు తక్కువ జీతాలు ఇస్తు అధిక సమయం పని చేపించుకుంటు వారినీ సొమ్ము చేసుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు…

పత్తా లేని సేఫ్టీ అధికారులు.

కల్లకల్,కూచారం, ముప్పిరెడ్డిపల్లి,కొండాపూర్,పారిశ్రామిక వాడలో గత కొన్ని రోజులుగా ఎంతో మంది కార్మికులు కనీస ప్రథమ చికిత్స కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పత్రికల్లో వచ్చిన వార్తలను కొంతమంది అధికారులూ,యూనియన్ నాయకులు పరిశ్రమ యాజమాన్యం తో మాట్లాడి లక్షలు తింటున్నారు తప్ప చనిపోయిన వారి కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరిగేలా చేయడం లేదు దీనిపై సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు…

తూప్రాన్ పౌర సరఫరాల గోదాంలో 3 కోట్ల అక్రమాలు.

0

తూప్రాన్ పౌర సరఫరాల గోదాంలో 3 కోట్ల అక్రమాలు

ఆర్.ఐ గా పనిచేసిన చింతల నాగేష్ పై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు.

తూప్రాన్ ఫిబ్రవరి 08, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

తూప్రాన్ పౌర సరఫరాల గోదాం లో 3 కోట్ల అక్రమాల కేసులో ఆర్.ఐ గా పనిచేసిన చింతల నాగేష్ ను నాలుగు సెక్షన్లు ఐపీసీ 406, 409, 420 క్రింద కేసు నమోదు చేసి రెండవ సారి రిమాండ్ కు తరలించిన పోలీసులు గతంలో సంవత్సరం క్రితం తూప్రాన్ రెవెన్యూ కార్యాలయంలో ఆర్.ఐ గా పని చేసినప్పుడు 12 గుంటల భూమి విషయంలో రైతు బ్రతికుండగానే చనిపోయాడని తప్పుడు ధ్రువీకరణ చేసి వేరే వ్యక్తి భూమి ని రిజిస్ట్రేషన్ చేసిన విషయంలో జైలుకు వెళ్లగా మళ్ళీ ఇప్పుడు 2019 నుండి 2024 వరకు పౌర సరఫరాల గోదాం లో సుమారు 3 కోట్ల వరకు అక్రమంగా పిడిఎఫ్ రైస్, చక్కెర, గోన సంచులు లో అక్రమాలు చేసినట్లు సివిల్ సప్లై డిస్టిక్ మేనేజర్ హరిక్రిష్ణ ఫిర్యాదు మేరకు నాలుగు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్ కు తరలించారు.

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు బి.రవి ప్రకాష్ అధ్యక్షతన సమావేశం. 

0

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు బి.రవి ప్రకాష్ అధ్యక్షతన  సమావేశం.

2024 డైరీ-క్యాలండర్ ప్రారంభోత్సవం, ఉద్యోగుల సంక్షేమం పై చర్చ.

మేడ్చల్ జిల్లా, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

శుక్రవారం  మేడ్చల్ కలెక్టర్ బిల్డింగ్ లో ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) అధ్యక్షులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు, శ్రీ బి రవి ప్రకాష్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో క్రింది అంశాలపై చర్చించడం జరిగింది, 2024 డైరీ-క్యాలండర్ ప్రారంభోత్సవం ఉద్యోగుల సంక్షేమానికి అవసరమైన కీలక అంశాలపై చర్చించేందుకు ఈ అత్యవసర మరియు కార్యనిర్వాహక కమిటీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి జిల్లా మరియు వివిధ యూనిట్ ఫోరమ్ ల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో చర్చించారు.2024 డైరీ-క్యాలండర్ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరు విజయవంతం చేయడానికి ఉద్యోగులందరూ చురుగ్గా పాల్గొని సహకరించాలని తెలిపారు.ఈ సమావేశంలో కేంద్ర సంఘం ఇసి సభ్యులు, పాలుభై ఈశ్వర్, శశికాంత్, భరత్ కుమార్ – కార్యదర్శి,శామ్యూల్ పాల్_ అసోసియేట్ ప్రెసిడెంట్, గిరికాంత్ – కోశాధికారి, రవి చంద్ర – ఉపాధ్యక్షుడు 1, హరి యాదవ్ -ఉపాధ్యక్షుడు 2, శ్రీచంద్ – జాయింట్ సెక్రటరీ 1, రజని – జాయింట్ సెక్రటరీ 2, పారిజాతం – జాయింట్ సెక్రటరీ, కొండల్ రావు – ప్రచార కార్యదర్శి, సురేష్ – ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎన్ అనిల్ కుమార్ – ఈసి సభ్యుడు, కార్తీక్ – ఈసి సభ్యుడు, అన్నపూర్ణ ఈసి సభ్యురాలు నజీమా – జ్యోతి కుత్బుల్లాపూర్ యూనిట్ అధ్యక్షురాలు – కార్యదర్శి, సత్య జ్యోతి – జాయింట్ సెక్రటరీ,రాంచందర్ – కె.వేణుగోపాల్,మల్కాజిగిరి అధ్యక్షుడు కార్యదర్శి అరుణ, ఉపాధ్యక్షురాలు,శ్రీనివాస్ – మేడ్చల్ యూనిట్ అధ్యక్షుడు, రవికుమార్ – శామీర్‌పేట అధ్యక్షుడు, మాణిక్యం- బీసీ సంక్షేమ అధ్యక్షుడు, అనిత కార్యదర్శి , మినిస్టరియల్ ఫోరమ్ మరియు సత్యం , మెడికల్ అండ్ హెల్త్ ఫోరమ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జర్నలిస్టు దుర్గయ్య జన్మదిన వేడుకలు.

0

ఘనంగా జర్నలిస్టు దుర్గయ్య జన్మదిన వేడుకలు.

ఎల్బీనగర్: గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

సీనియర్ జర్నలిస్టు దుర్గయ్య జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహేశ్వరం నియోజకవర్గం డివిజన్ ఎన్టీఆర్‌ నగర్ లోని శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయ ప్రతినిధి గునగంటి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం దుర్గయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటేష్ గౌడ్ తీసుకొచ్చిన కేకును దుర్గయ్య కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుగా దుర్గయ్య ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. అంతకుముందు దుర్గయ్యను వెంకటేష్ గౌడ్, ఇతరులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అయితగోని శంకర్ గౌడ్, మహ్మద్ నజీర్ అహ్మద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థికి పెద్ద మనసుతో సహాయం చేసిన మనసున్న మారాజు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్.

0

పేద విద్యార్థికి పెద్ద మనసుతో సహాయం చేసిన మనసున్న మారాజు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్. 

హైదరాబాద్/ జనవరి 27, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దీప్తి అనే పేద విద్యార్థికి శనివారము ఆర్టిఐ మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ గారు పెద్ద మనసుతో హాస్టల్ ఫీజు కోసం 25 వేల రూపాయలు సహాయం చేయడం పట్ల బలహీనవర్గాల రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు జే.క్రాంతి త్రినేత్రుడు అభినందనలు తెలిపారు.

ప్రేమే లక్ష్యంగా సేవే మార్గంగా నిరంతరం పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప వ్యక్తిగా డాక్టర్ వర్రె.వెంకటేశ్వర్లు యాదవ్ చరిత్రలో నిలిచిపోయారని క్రాంతి పేర్కొన్నారు.మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడు తల్లిని కోల్పోయిన దీప్తి యాదవ్ తండ్రికి చిన్ననాటి నుండి డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ గారు పెద్దదిక్కుగా నిలిచారనీ క్రాంతి పేర్కొన్నారు.పేద బిడ్డలు పెద్ద చదువులు చదవాలని తన తండ్రి రాఘవయ్య మాస్టర్ ఇచ్చిన ప్రేరణతో ఉన్నత విద్యలు అభ్యసించిన డాక్టర్ గొర్రె వెంకటేశ్వర్లు యాదవ్… తన తండ్రి ఆశయ సాధన లో భాగంగా నిరంతరం పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని క్రాంతి తెలిపారు.పేద వర్గాల ఆత్మీయుడు, అభ్యుదయ వాది డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు యాదవ్ గారికి ఈ సందర్భంగా అభినందనలు,హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బలహీనవర్గాల రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకులు నేతాజీ రాజన్న.

కామన్ సర్వీస్ సెంటర్ (ఆధార్ సెంటర్) ను ప్రారంబించిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్. 

0

కామన్ సర్వీస్ సెంటర్ (ఆధార్ సెంటర్) ను ప్రారంబించిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్.

మేడ్చల్ జిల్లా, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

ప్రస్తుతం ఇండియా మొత్తం డిజిటల్ యుగంగా మార్పు చెందుతుంది ఏది కోరితే అది క్షణాల్లో మన ముందు అందుబాటులొ ఉంటుంది ప్రతి ఒక్కరూ డిజిటల్ యుగం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో చర్లపల్లి లో అందరికి అందుబాటులో ఉండే విదంగా కామన్ సర్వీస్ సెంటర్ ను ఎర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ మంచి కార్యక్రమానికి పూనుకున్నారు లక్ష్మణ్, చెర్లపల్లి డివిజన్ లోని సిల్వర్ ఓక్ బంగ్లా ముందున్న చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫీస్ లో పనిచేసే లక్ష్మణ్ ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) / (ఆధార్ సెంటర్) ను ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు శనివారము ఘనంగా ప్రారంభించారు. శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ .ఆన్ లైన్ లో చేసుకునే అన్ని సదుపాయాలు ఉంటాయని అన్నారు,

ఆధార్ కార్డు , పాన్ కార్డు, ఓటర్ ఐడి, బ్రాడ్ బ్యాండ్ రీఛార్జ్, డీ 2 హెచ్ రీఛార్జ్, కరెంట్ బిల్ కట్టే సదుపాయం మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకునే సదుపాయం, నల్లా బిల్లు కట్టే సదుపాయం, ట్రైన్ టికెట్స్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్ బుకింగ్ లు కులం సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్, నివాస ధృవకరణ పత్రం, ఆధార్ లో మార్పులు చేర్పులు, ఓటరు ఐ డి లో మార్పులు ఉద్యమ రిజిస్ట్రేషన్,ట్రేడ్ లైసెన్స్,షాప్ లైసెన్స్,కల్యాణ లక్ష్మి, షాదిముబారక్, పీ ఎఫ్, ఈ యస్ ఐ, డబ్బులు ట్రాన్స్ఫర్ లకు సంబంధించి తదితర సదుపాయాలు ఇక్కడ అందుబాటులొ ఉంటాయని ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో జక్కా రోషి రెడ్డి, బాల్ రెడ్డి, ప్రభు గౌడ్, నారెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పారిశ్రామిక వేత్తలు, తదితరులు పాల్గొన్నారు.